
60 Years OldMan : ఈ వార్త వింటే అతడు సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగే గుర్తుకు వచ్చింది. కానీ అక్కడ ఒక సీన్ ను బట్టి ఉంటే ఇక్కడ మరోటిగా మనం వాడుకోవచ్చు. ఆ డైలాగ్ ‘ముసలోడే కానీ మహానుభావుడు’. ఇక్కడ అది ఒక మహానుభావుడికి వర్థిస్తుంది. ఒక వృద్ధుడు యువతిని పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు. వృద్ధుడు ఏంటి.. ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం ఏంటని కొందరు అనుకున్నా ఇది పచ్చి నిజం దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సైన్స్ పరంగా చూస్తే ఇది సాధ్యమే కానీ శారీరకంగా, సంప్రదాయం పరంగా చూస్తే కొంచెం కష్టమనే చెప్పాలి. హాయిగా రామా.. కృష్ణా.. అనుకునే వయసులో ఒక వృద్ధుడు ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అదేదో ఫెర్టిలిటీ ద్వారానో కాదు. నేరుగా కాపురం చేసి మరీ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు. గతంలో ఒక వృద్ధురాలు కూడా ఈ సాహసాన్నే చేసింది. దాదాపు ఆరు పదుల వయస్సు దాటిన తర్వాత ఇద్దరికంటే ఎక్కువ మంది కవలలకు జన్మనిచ్చింది. కానీ ఇక్కడ ఆమె వైద్యుల సలహాలు, సూచనల మేరకు నడుచుకుంటూ కన్నది. కానీ ఇక్కడ అలా కాదు. నేరుగా.. ప్రకృతి పరంగానే ముగ్గురు పిల్లలు పుట్టారు.
మధ్యప్రదేశ్ కు చెందిన గోవింద్ కుష్యాహాకు 62 సంవత్సరాలు ఉంటాయి. అయితే గోవింద్ కు మొదటి భార్య కొడుకు ఒక ప్రమాదంలో మరణించాడు. కొడుకులు కావాలని పట్టుబట్టాడు గోవింద్. మొదటి భార్యకు పిల్లలు పుట్టరని, పుట్టినా జాతక రీత్యా దక్కరని రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. 62 సంవత్సరాలు నిండినా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. 30 సంవత్సరాల వయస్సున్న హీరాబాయిని పెళ్లి చేసుకున్నాడు. కాపురం కూడా చేశాడు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత హీరాబాబు గర్భం దాల్చింది. ఇటీవల పురిటినొప్పులు రావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. మొదటి కాన్పులో ఆమె మగ్గురు శిశువులకు జన్మనిచ్చింది.
ఇక గోవింద్ ను తన గ్రామంలోని అందరూ ముసలోడే కానీ మహానుభావుడు అంటూ అనుకుంటున్నారట. రామా… కృష్ణా.. అనుకునే వయస్సులో ముగ్గురు పిల్లల బాధ్యత మీద పడేసుకోవడంపై సర్వత్రా చర్చలు వినిపిస్తున్నాయి.
|
ReplyForward
|






