
Aadhi Pursh Movie : ఆదిపురుష్ సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. సినిమా నిర్మాణంలో గ్రాఫిక్స్ ను నమ్ముకున్నా సహజత్వం లేకుండా పోయిందని పలువురు విమర్శిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో ఆదిపురుష్ సినిమాపై తమ అసహనం వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామరాజ్యం సినిమా పోస్టర్ ను పెడుతున్నారు. అందులో బాలకృష్ణ గెటప్ గురించి రాస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా ఆద్యంతం పిల్లలను ఆకట్టుకునేలా ఉంది. సాంకేతికత సాయంతో కొత్తదనంగా తీశారు. కానీ పాత తరం వారిని మాత్రం ఆకట్టుకోవడం లేదు. రాముడి పాత్రలో బాలకృష్ణ ఒదిగినంతగా ప్రభాస్ కు సూట్ కాలేదని చెబుతున్నారు. అందులో సీత పాత్రలో నయనతార, లక్ష్మణుడి గెటప్ లో శ్రీకాంత్ అద్భుతంగా నటించారు. ఆ సినిమా విజయం సాధించకపోయినా తన ఉనికిని మాత్రం చాటింది.
ఇప్పుడు ఆదిపురుష్ సినిమా విషయంలో చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. బాపు దర్శకత్వంలో బాలకృష్ణ రాముడిగా తీసిన శ్రీరామరాజ్యం హిట్ కాకపోయినా అందరి మనసులు కొల్లగొట్టింది. వారు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. వారి పాత్రలను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆదిపురుష్ విడుదల సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ రికార్డులు మాత్రం బ్రేక్ చేస్తోంది. నిన్న ఒక్కరోజే రూ.250 కోట్లు రాబట్టింది. దక్షిణాదిలో రూ.185 కోట్లకు అమ్ముడుపోయింది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రికార్డులు బద్దలు కొడుతోంది. ఒకవైపు విమర్శలు ఎదుర్కొంటున్నా మరోవైపు కలెక్షన్లు అద్భుతంగా రాబడుతోంది. రూ.500 కోట్లతో నిర్మించిన సినిమా కావడంతో ఓటీటీ, డిజిటల్ ద్వారా భారీగానే కలెక్షన్లు వసూలు చేస్తోంది.
|
ReplyForward
|






