
Adhi Pursh Movie : పాత్రల చిత్రీకరణ విరుద్ధంగా ఉన్నాయని హిందూసేన పిల్
ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన ఓం రౌత్ యొక్క ఆదిపురుష్ థియేటర్లలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ సినిమా మరో సమస్యలో చిక్కుకుంది. హిందూ ఇతిహాసం రామాయణం, హిందూ దేవుళ్లు,దేవతలను సంస్కృతిని అపహాస్యం చేసిందని పేర్కొంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ హైకోర్టులో ఈ చిత్రంపై పిల్ దాఖలు చేశారు
రాముడు, రావణుడు, సీత, హనుమంతునికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. సినిమాలో ఈ దేవతలను చిత్రీకరించిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రామాయణంలో కనిపించే పాత్రల వర్ణనలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు.
హిందువులు రాముడు, సీత మరియు హనుమంతుని చిత్రాలపై విలక్షణమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. చిత్ర నిర్మాతలు, దర్శకులు లేదా ప్రదర్శకులు ఆ చిత్రాలను ఏదైనా మార్పు చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనంటున్నారు.
అయితే ఈ సన్నివేశాలు మతపరమైన పాత్రలను నెగెటివ్ గా చూపిస్తున్నాయని, హిందూ నాగరికత, హిందూ మతపరమైన వ్యక్తులు, విగ్రహాలు మొదలైనవాటిని పూర్తిగా అవమానించేలా ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. హిందూ దేవతల చిత్రాన్ని వక్రీకరించినందుకు ఆదిపురుష్ నిర్మాతలను నిందిస్తున్నారు. పురాణాలలో రూపొందించిన చిత్రం ప్రకారం కేశాలంకరణ, గడ్డం, వస్ర్తధారణ విరుద్ధంగా ఉందని పిల్ లో పేర్కొన్నాడు. సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎలాంటి వైవిధ్యం చూపినా ఆరాధకులు, భక్తులు, మత విశ్వాసుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు.
|
ReplyForward
|






