Cricketer Ambati Rayudu : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నారు. దీనిపై రాయుడు కూడా క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని ప్రకటించారు. గత కొంతకాలంగా రాయుడు ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. ప్రజాసేవకు వెళ్లేముందు జనం నాడి తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు వైసీపీలో చేరేందుకు అంబటి రాయుడు ఇప్పటికే గ్రౌండ్ క్లియర్ చేసుకున్నారని అంతా అనుకుంటున్నారు.
ఇటీవల ఐపీఎల్ రాయుడు సత్తా చాటాడు. ఐపీఎల్ సీజన్ ముగిశాక క్రికిట్ కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ సీజన్ జరుగుతున్నప్పుడే అంబటి రాజకీయ ప్రవేశం గురించి వార్తలు బయటకు వచ్చాయి. ఏపీ సీఎం జగన్ ను ఆయన పలుమార్లు కలువడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. ఏపీలో క్రికెట్ అకాడమీ పెట్టేందుకు మాత్రమే జగన్ ను కలుస్తున్నట్లు అంబటితో మీడియాతో చెప్పేవారు. కానీ అప్పటికే అంబటి వైసీపీలో చేరబోతున్నారని, ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
అయితే క్రికెట్ లో రాయుడు ఒక సంచలనంగా నిలిచారు. హైదరాబాద్, ఆంధ్ర టీంలకు ప్రాతినిథ్యం వహించారు. ఇండియన్ టీంలో కూడా ఆడారు. గత ప్రపంచకప్ కు సెలెక్ట్ కాకపోవడంతో రాయుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం రేపాయి. ఆంధ్రకే చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ లక్ష్యంగా ఆయన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత టీడీపీపై కౌంటర్ వ్యాఖ్యలు చేయడంతో ఇక అంబటి వైసీపీలోకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు.ఎక్కడో చోట బిల్డింగ్ కడితే అది అభివృద్ధి కాదని పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి అన్నారు. ఇక తర్వాత సీఎం జగన్ కు మద్దతుగా పలు ట్వీట్లు చేశారు. ఇక అంబటి రాయుడు గుంటూరు లేదా మచిలీపట్నం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది. అయితే అంబటి రాజకీయ ఎంట్రీపై ఇక పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. తాను ప్రజాసేవలోకి వస్తున్నట్లు చెబుతారు.
ReplyForward
|