పెరుగుతున్న జనాభా విస్తరిస్తున్న పట్టణ విస్తీర్ణంతో ట్రాఫిక్ కు నిరంతరం కష్టాలే. ఈ నేపథ్యంలో ఎగిరే వాహనాలు వస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి. ఇప్పటి వరకు రోడ్లపై ఉన్న ట్రాఫిక్ జాం ఇప్పుడు గాల్లో ఉంటుంది అన్నమాట. సరే ట్రాఫిక్ జాం గురించి పక్కన పెడితే ఫస్ట్ ఎగిరే కారులో ప్రయాణం అంటేనే ఒల్లు గగుర్పాటుకు గురవుతుందిగా.. ఇలాంటి ఎగిరే కారు త్వరలోనే మన ముందుకు రాబోతోంది. దీనికి యూఎస్ గవర్నమెంట్ ఆమోదం కూడా వేసిందట. ఇక రోడ్లపై ఈ కార్లు కూడా తిరుగుతాయన్నమాట.
‘అలెఫ్ ఏరోనాటిక్స్’ సంస్థ తయారు చేసిన ఈ ఫ్లయింగ్ కారుకు యూఎస్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేస్ (ఎఫ్ఏఏ) నుంచి స్పెషల్ ఎయిర్ వర్తీనెన్ సర్టిఫికెట్ ను కూడా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఏవియేషన్ లా సొసైటీ ‘ఏదో లా సెంటర్’ ప్రకారం.. ఈ తరహా వాహనం యూఎస్ లో ఇలాంటి సర్టిఫికెట్ పొందడం ఇదే ఫస్ట్.
ఈ కారుపై ఫాక్స్ న్యూస్ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. క్యాలీఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా తయారైన ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. ఒక్కరు, లేదా ఇద్దరు ఇందులో ప్రయాణం చేయవచ్చు. రోడ్డుపై ట్రాఫిక్ జాం జరిగినప్పుడు ఉన్నచోటు నుంచే గాల్లోకి ఎగురవచ్చు. దీని ధర దాదాపు 3 లక్షల డాలర్లు (రూ. 2.5 కోట్లు) ఉండనుంది.
2025 చివరి నాటికి కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఆర్డర్లు కూడా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. వారి కోరికలకు అనుగుణంగా ఉత్పత్తి స్టార్ట్ చేస్తామిన అలెఫ్ కంపెనీ సీఈవో జిమ్ దుఖోవ్నీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంస్థ వెబ్ సైట్ ప్రకారం.. వీటిన పట్టణాల్లోనే కాకుండా సాధారణ గ్రామీణ రోడ్లపై కూడా నడిపేందుకు తయారు చేస్తున్నామని, సాధారణ పార్కింగ్ స్థలాల్లోనే వీటిని పార్క్ చేయవచ్చని తెలిపింది. రోడ్డుపై తక్కువ వేగంతో (గంటకు 25 మైళ్ల చొప్పున) మాత్రమే ప్రయాణించే ఈ కారు గాల్లో వేగంగానే ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.