23 C
India
Tuesday, October 6, 2026
More

    Kadapa MP YS Avinash Reddy : అవినాష్ తల్లికి శస్త్ర చికిత్స జరగలేదా.. సునీత ఏం చెబుతోంది?

    Date:

    Kadapa MP YS Avinash Reddy

    Kadapa MP YS Avinash Reddy

    Kadapa MP YS Avinash Reddy :  వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పై తన సోదరి సునీతా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తన తల్లికి ఆపరేషన్ జరుగుతున్న దని అవినాష్ రెడ్డి కోర్టుకు సమర్పించింది అబద్ధమని తెలంగాణ హైకోర్టులో బుధవారం ఆమె మెమో దాఖలు చేశారు.

    తన తల్లికి గుండె బ్లాకులు మూసుకుపోవడంతో చికిత్స జరుగుతోందని అవినాష్ రెడ్డి తరఫున లాయర్ చెప్పారని, మీడియా కథనాల ప్రకారం ఆమెకు ఎలాంటి చికిత్స జరగలేదని పేర్కొన్నారు. చికిత్స జరుగుతుంది అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ,గత ఆదేశాల ప్రకారం అవినాష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని సునీత రెడ్డి తరఫున లాయర్ కోరారు అయితే సునీతా రెడ్డి దాఖలు చేసిన మెమో ను న్యాయమూర్తి స్వీకరించారు.
    కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇప్పటికే హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే సిబిఐ అవినాష్ పై కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. అయితే హైకోర్టు తీర్పుపై సునీత ఆసంతృప్తిగా ఉన్నారు. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు నేపథ్యంలో ప్రస్తుతం  బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని ఆమె భావిస్తున్నారు. అయితే వివేకా హత్య కేసులో మరికొందరిపై కూడా ఆమెకు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ప్రతి శనివారం విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఈ వారం హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అవినాష్ రెడ్డి పాత్ర పై ఇప్పటివరకు సిబిఐ ఎలాంటి  ఆధారాలు చూపకపోవడంతోనే ముందస్తు బెయిల్ రావడానికి కారణం అని పలువురు భావిస్తున్నారు

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bigboss-8: బిగ్ బాస్-8 లో సరికొత్త ప్రయోగం.. ఆ కంటెస్టెంట్స్ తో నామినేషన్స్

    Bigboss-8: బిగ్ బాస్ షో సీజన్ -8లో సరికొత్త ప్రయోగాలు సాగుతున్నాయి. పాత...

    Avinash : కొత్త కారు కొనడంతో ముక్కు అవినాష్ పై విమర్శల వెల్లువ

    Avinash జబర్దస్త్ లో ముక్కు అవినాష్ కి మంచి పేరుంది. కామెడీ...

    Srimukhi & Avinash : శ్రీముఖికి అవినాష్ ముద్దు.. చెంప చెళ్లుమనిపించిన యాంకర్..!

    Srimukhi & Avinash : యాంకర్ శ్రీముఖి అంటే తెలియని తెలుగు...

    Jabardasth Avinash : గుడ్ న్యూస్ చెప్పిన అవినాష్.. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంట..!

    Jabardasth Avinash : సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే...