40.6 C
India
Thursday, April 18, 2024
More

    బాలయ్య లెజెండ్ చిత్ర సంచలనానికి 9 ఏళ్ళు

    Date:

    balayya's legend movie completes 9 years
    balayya’s legend movie completes 9 years

    నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సంచలన చిత్రం ” లెజెండ్ ”. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ , వారాహి చలనచిత్రం సంయుక్తంగా నిర్మించింది. అనిల్ సుంకర , రామ్ ఆచంట , సాయి కొర్రపాటి , ఆచంట గోపి ఈ సినిమాను నిర్మించారు. 2014 మార్చి 28 న భారీ ఎత్తున విడుదలైంది లెజెండ్.

    రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను దున్నేసింది. 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లెజెండ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 90 కోట్ల వసూళ్లను సాధించింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం నందమూరి అభిమానులను విశేషంగా అలరించింది. బాలయ్య చెప్పిన డైలాగ్స్ థియేటర్ లలో డైనమైట్ లలా పేలాయి.

    దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు , నేపథ్య సంగీతం లెజెండ్ చిత్రాన్ని మరో లెవల్ లో నిలబెట్టింది. ఇక జగపతి బాబు అంటే ఫ్యామిలీ చిత్రాల హీరో …… ఒకప్పటి శోభన్ బాబు అన్నమాట. అలాంటి జగపతి బాబును ఈ చిత్రంలో విలన్ గా చూపించి సక్సెస్ అయ్యాడు బోయపాటి. జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ పీక్స్ చేరుకోవడానికి లెజెండ్ చిత్రానిది కీలక పాత్ర.

    బాలయ్య సరసన అందాల ముద్దుగుమ్మలు రాధికా ఆప్టే , సోనాలి చౌహన్ నటించారు. ఇక కీలక పాత్రల్లో రావు రమేష్, ఈశ్వరి రావు , సుమన్ , కళ్యాణి , సుహాసిని , చలపతి రావు , బ్రహ్మానందం , హంసా నందిని , జయప్రకాశ్ రెడ్డి , బ్రహ్మాజీ , ఎల్బీ శ్రీరామ్ , వైజాగ్ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 9 ఏళ్ళు పూర్తయ్యింది. దాంతో బాలయ్య అభిమానులు మరోసారి పండగ చేసుకుంటున్నారు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో మొదటిసారిగా సింహా రాగా అది రికార్డుల మోత మోగించింది. కట్ చేస్తే రెండో సినిమాగా లెజెండ్ వచ్చి ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత అఖండ చిత్రంతో హ్యాట్రిక్ కూడా కొట్టారు. ఇక మరోసారి నాలుగో సినిమాకు రెడీ అవుతున్నారు బాలయ్య – బోయపాటి.

    Share post:

    More like this
    Related

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    CM Jagan : సిఎం జగన్ పై దాడి కేసులో అప్ డేట్

    - నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు CM Jagan : సిఎం జగన్...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balayya Vs Kodali Nani : ‘కొడాలి’పై బాలయ్య.. బాబు టార్గెట్ అదే!

    Balayya Vs Kodali Nani : కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని....

    Vఉప్పొంగుతున్న ఎద ఎత్తులు బయట పెట్టేసిన పూజాహెగ్డే..!

    ప్రపంచంతో పాటు భారత్ లో కూడా ఆండ్రాయిడ్ మొబైళ్ల వినియోగదారులు ఎక్కువ...

    Skanda Movie Review : ‘స్కంద’ రివ్యూ.. రామ్ కు బోయపాటి మాస్ హిట్ ఇచ్చాడా?

    Skanda Movie Review : టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న...

    Top Heroes : సీజన్ వారీగా రాబోతున్న టాప్ హీరోలు.. ఏడాదంతా పూనకాలే..!

    Top Heroes : 2023 ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి నటసింహం బాలయ్య...