
Bandla Ganesh : బండ్ల గణేష్ గురించి తెలియని తెలుగు ప్రజలు లేరు అంటే అతియసోక్తి కాదేమో.. ట్విట్టర్ లో బండ్ల గణేష్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచేవాడు.. ఈ మధ్యనే కాస్త వివాదాస్పద కామెంట్స్ ను చేయడం లేదు అని అంతా అనుకుంటున్నారు.. తనకి నచ్చినట్టు పోస్టులు పెడుతూ తనని ఎవరో మోసం చేసినట్టు ఇప్పుడు బుద్ధి వచ్చినట్టు ట్వీట్స్ చేస్తూ హల్ చల్ చేస్తూనే ఉంటాడు.
మరి ఈ ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించి ఎందుకు పెడతాడో ఎవ్వరికి అర్ధం అయ్యేది కాదు.. కానీ తాజాగా బండ్ల గణేష్ రూటు మార్చేసి త్రివిక్రమ్ మీద గురి ట్వీట్స్ చేస్తూ ఆయనను టార్గెట్ చేస్తున్నాడు. తన అభిమాన హీరోకు తనని దూరం చేసాడని ఈయనను ఒక ఆట ఆడుకుంటున్నాడు. తనదైన శైలిలో త్రివిక్రమ్ మీద సెటైర్స్ వేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.
ఎక్కడ త్రివిక్రమ్ పేరు ప్రస్తావించకుండానే గురూజీ అంటూ సంబోధిస్తూ వరుసగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నాడు. ఇక తాజాగా బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ.. ”భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి.. అని మరోసారి ట్వీట్ తో తనలోని కోపాన్ని, ఆక్రోశాన్ని బయట పెట్టాడు.
ఈ ట్వీట్ చూసి చాలా మంది నెటిజెన్స్ సమర్దిస్తుంటే.. మరికొంత మంది విమర్శిస్తున్నారు.. భక్తుడిని దూరం చేసే శక్తి ఎవ్వరికి ఉండదు.. భక్తుడి నడవడికనే భగవంతుడికి దూరం చేస్తుంది అని వీడు ఒక గుంటనక్క వీడిని నమ్మకండి అని.. పవన్ ను స్వార్ధం కోసం దేవుడు అంటూ వాడుకుంటాడు అంటూ కామెంట్స్ చేస్తూ బండ్ల గణేష్ కు చుక్కలు చూపిస్తున్నారు. మరి ఇకనైనా ఈ ట్వీట్స్ ఆపుతాడో లేదో చూడాలి..
భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి
భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి 😂
— BANDLA GANESH. (@ganeshbandla) May 27, 2023