29.3 C
India
Tuesday, February 10, 2026
More

    BC Bandhu.. Procedures : బీసీ బంధు.. విధి విధానాలు.. అర్హులు ఎవరు..?

    Date:

     

    Bc-bandhu-procedures-
    Bc-bandhu-procedures

    BC Bandhu.. Procedures : బీసీలకు బీసీ బంధును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా బీసీ కులాల వారికి, కుల వృత్తులు చేసుకుంటున్న వారికి రూ. లక్ష ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ పథకాన్ని ఈ నెల 9వ తేదీన ప్రారంభించనుంది. కుల వృత్తులు చేసుకునే ఒక్కో కుటుంబానికి రూ. లక్ష (కుటుంబంలో ఒక్కిరికి మాత్రమే) చొప్పున అందించనుంది.

    రజక, విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ,  కమ్మరి, శాలివాహన, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆదుకునేందుకు రూ.లక్ష అందించనుంది. ఈ పథకం కోసం కొందరి సభ్యులతో మంత్రివర్గ ఉప సంఘం కూడా వేశారు. ఈ ఉప సంఘం విధి విధానాలను ఖరారు చేసింది. అర్హులు ఎవరు..? నగదు ఎలా అందుతుంది..? నగదును ఏం చేయాలి..? ఇలా అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చింది.

    కుటుంబంలో ఎంత మందికి ఇస్తారు?
    కుటుంబానికి ఒక్కరికి మాత్రమే రూ. లక్ష సాయం అందిస్తారు.

    ఏ వయస్సు వారు అర్హులు?
    2 జూన్, 2023 వరకు 18 నుంచి 55 ఏళ్లు ఉన్న వారు మాత్రమే అర్హులు.

    దరఖాస్తు ఎలా?
    ఆన్ లైన్ లో చేసుకోవాలి. https://tsobmms.cgg.gov.in/ ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.

    వార్షిక ఆదాయం ఎంతుండాలి?
    గ్రామీణ ప్రాంతాల వారైతే రూ.1.50 లక్షలోపు, పట్టణ ప్రాంత వారైతే రూ.2 లక్షల లోపు ఉండాలి.

    అర్హులు కానిది ఎవరు?
    5 సంవత్సరాల నుంచి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.50 వేల కంటే ఎక్కువ లబ్ధి పొందిన వారు అనర్హులుగా పరిగణిస్తారు.

    దరఖాస్తు ప్రారంభం, చివరి తేదీలు?
    ఈ పథకానికి సంబంధించి అప్లయి చేసుకునేందుకు జూన్ 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

    దరఖాస్తు పరిశీలన ఎప్పుడు?
    అప్లయ్ చేసుకున్న వారి దరఖాస్తులను మండల మున్సిపాలిటి స్థాయిలో అధికారులు 20వ తేదీ నుంచి  26వ తేదీ వరకు పరిశీలిస్తారు. ఆ తరువాత కలెక్టర్ అధ్యక్షతన సెలెక్షన్ కమిటీ వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత జూన్ 27వ తేదీ నుంచి ఇన్ చార్జి మంత్రుల ఆమోదంతో జులై 4వ తేదీ వరకు లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి ఆయా గ్రామ, మండల స్థాయిల్లో, వెబ్ సైట్ లో లిస్టులను ప్రదర్శిస్తారు.

    వన్ టైమ్ బెనిఫిట్‌గా నిధులు
    ఎంపికైన లబ్ధిదారులు ప్రతి నెలా 15న వన్ టైమ్ బెనిఫిట్ గా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.

    వారికే పూర్తి స్వేచ్ఛ
    ఈ డబ్బుతో లబ్ధిదారుడు ఎలాంటి ఉపకరణాలనైనా కొనుక్కోవచ్చు.
    ఆర్ధిక సాయం అందిన తరువాత నెలలోనే యూనిట్లను గ్రౌండింగ్ చేసుకునేలా పేర్కొన్నారు.
    కలెక్టర్ అపాయింట్ మెంట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ లేదా ఎంపీడీవో లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను పరిశీలిస్తారు.
    రెండు సంవత్సరాల వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషల్ ఆఫీసర్ ఆ యూనిట్లను పరిశిలిస్తారు. లబ్ధిదారులకు కీలక సలహాలు, సూచనలు ఇస్తారు.

    9వ తేదీన మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ ఆ పథకాన్ని ప్రారంభించనున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related