Kamalahasan : డైరెక్టర్స్ తో ఒద్దికగా ఉండాలి. ఎవరితో ఏ సినిమా చేస్తే ఎలా వస్తుంది.? దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై డైరెక్టర్ కు మంచి పట్టు ఉంటుంది. హీరోకు పట్టు ఉన్నా.. అది డైరెక్టర్ కు ఉన్నంతగా ఉండదు. స్టోరీ చెప్పినప్పుడు మార్పులు, చేర్పులు కోరడం సహజం. కానీ డైరెక్టర్ కోణం నుంచి పూర్తి విరుద్ధంగా పక్కకు తీసుకెళ్తే.. డైరెక్టర్ ఆ హీరోనే పక్కన పెడతాడు. ఇక అదే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. తన ఖాతాలోంచి పోయిందని హీరో బాధపడాల్సిందే.. అదే డిజాస్టర్ అయితే డైరెక్షన్ లో మార్పు తెచ్చుకుంటాడు డైరెక్టర్. కానీ హీరోతో పోల్చుకుంటే ఆయనకు నష్టం తక్కువే.
చలన చిత్ర పరిశ్రమలో ఏ ఇండస్ట్రీ నుంచైనా ఆ పాత మధురాలు బయటకు వస్తే ఇప్పటి తరం కూడా ఆసక్తిగా తిలకిస్తుంది. ఇలాంటి ఘటన గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్, వీరందరితో సమకాలికంగా పని చేశారు నట విభూషనుడు శోభన్ బాబు. ఆ సమయంలో ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అందగాడిగా బిరుదులు కూడా ఉన్నాయి. నటుడిగానే కాకుండా మహోన్నత వ్యక్తిగా చాలా మందికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇండస్ట్రీలో సావిత్రీ లాంటి వారి జీవితాలను చూసిన ఆయన డబ్బుకు చాలా విలువ ఇచ్చేవారు. ఎంతో మంది నిర్మాతలు, తోటి నటులకు ఆయన డబ్బు విషయంలో సూచనలు చేసేవారు.
కుటుంబ కథా చిత్రాలకు శోభన్ బాబు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేవారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవారు ఆయన. డేట్స్ సరిపోకపోవడంతో చాలా సినిమాలను వదులుకున్నారు శోభన్ బాబు. ఇక కథ విషయంలో ఆయన ఒక పట్టాన అగ్రీ కాలేకపోయేవారట. అలా వదుకున్న సినిమానే ‘ఆకలి రాజ్యం’. ఈ సినిమా విషయంలో గమ్మత్తు జరిగింది. అది కూడా రాత్రికి రాత్రే హీరో మారిపోయాడు. ఒక హీరోతో అనుకున్న సినిమా మరో హీరోతో తీశాడు దర్శకుడు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
గ్రేట్ డైరెక్టర్ బాల చందర్ తెరకెక్కించిన సినిమా ‘ఆకలిరాజ్యం’. ఇందులో కమల్ హాసన్, శ్రీదేవి నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఎన్నో అవార్డులను సైతం దక్కించుకుంది. ఇక పాటల గురించి వేరే చెప్పక్కర్లేదు దాదాపు 4 దశాబ్దాల పైనే అయినా ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ఈ సినిమాకు శోభన్ బాబు అయితే బాగుంటుందని అనుకున్నాడు బాల చందర్. మొదట ఆయనకు కథను వివరించాడు. అయితే ఆయనకు హీరో పాత్రపై చాలా డౌట్స్ ఉండేవి. మార్పులు చేద్దామని చెప్పారు శోభన్ బాబు. కానీ బాల చందర్ లాంటి డైరెక్టర్ ఒప్పుకుంటాడా.. ససేమీరా అన్నాడు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువకుడు (ఆకలి రాజ్యం హీరో) ఎమ్ఏ ఫిలాసఫీ చదివి సెలూన్‌లో పనిచేయడం శోభన్ బాబుకి అస్సలు నచ్చలేదు. పని విషయంలో ఏదైనా మరుద్దమని కోరాడు. దానికి కూడా డైరెక్టర్ ఒప్పుకోలేదు.
ఇక, ఓపికపట్టలేక హీరోనే మర్చేశాడు డైరెక్టర్ బాల చందర్. శోభన్ బాబుకు బదులుగా కమల్ హాసన్ ను తీసుకున్నాడు. సినిమా విడుదలైంది. అద్భుతమైన విజయం సాధించింది. ఇంత పెద్ద హిట్ అవుతుందని శోభన్ బాబు ఊహించ లేదు. 100 డేస్ ఫంక్షన్ కు శోభన్ బాబును పర్సనల్ గా ఇన్వైట్ చేసేందుకు కమల్ హాసన్ వెళ్లాడు. సినిమా విజయాన్ని తాను ఊహించలేదని, నటన అద్భుతంగా ఉందని కమల్ హాసన్ కు కితాబు ఇచ్చాడు శోభన్ బాబు. కమల్ హాసన్ ను కౌగిలించుకొని కంటతడి పెట్టారట. ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని వదులుకున్నందుకు బాధపడ్డారట శోభన్ బాబు.
ReplyForward
|