Home EXCLUSIVE Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

24
Chennai
Chennai Toddler fell from the balcony viral

Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో అనుకోకుండా ఓ బాబు రెండో అపార్ట్ మెంటు నుంచి ఫస్ట్ అపార్ట్ మెంటు రేకుల మధ్యలో పడిపోయాడు. ఆ చిన్నారి అలా జారకుంటూ చివరకు వచ్చి ఆగిపోయాడు. ఏ మాత్రం వెనక్కి వచ్చిన ప్రమాదం జరిగి ఉండేది.

అయితే అదే అపార్ట్ మెంట్ లో మొదటి అంతస్థులో ఉన్న వారు ఆ చిన్నారిని రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ చిన్నారిని రక్షించడానికి చాాలా సమయం పట్టింది. దీంతో పాటు కింద పడిపోతే వెంటనే కాపాడేందుకు అపార్ట్ మెంటు వాసులు పది మందికిపైగా బెడ్ షీట్లు, దుప్పట్లు పట్టుకుని రెఢీగా ఉన్నారు. అయితే పిల్లవాడు అక్కడి దాకా జారుకుంటూ వచ్చి చివర్లో  ఆగిపోయాడు. దీంతో స్థానికులకు చిన్నారిని కాపాడేందుకు చాన్స్ వచ్చింది.

వెంటనే తేరుకున్న మొదటి అంతస్థులోని వారు, స్థానికులు మెల్లిగా మొదటి అంతస్థు బాల్కనీలోకి వెళ్లారు. ఒకరిపై ఒకరు ఎక్కి రేకుల మీద నుంచి జారుతున్న చిన్నారి కాళ్లను అందుకునే ప్రయత్నం చేశారు. మొదట ఒక వ్యక్తి ప్రయత్నించగా.. సాధ్యం కాలేదు. తర్వాత మరో వ్యక్తి ప్రయత్నించాడు. ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు ఎక్కి చిన్నారిని అందుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు.

చిన్నారిని కాపాడేందుకు కింద బెడ్ షీట్లు, బెడ్లు కూడా రెడీ పెట్టారు. ఒక వేళ బాబు కింద పడిపోతే ప్రమాదం జరగకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే ఈ తతంగాన్నంతా ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లోని వారు వీడియో తీశారు. దీన్ని ఎక్స్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ గా మారింది. చిన్నారిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. చిన్నారి అందులో ఎలా పడిపోయిందో మాత్రం ఇంతవరకు ఎవరికీ తెలియడం లేదు. ఎవరైనా పడేశారా.. లేక ఆడుకుంటూ వచ్చి అందులో పడిపోయిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.