సోషల్ మీడియాలో పరిచయాలు జీవితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయో తరుచూ చూస్తూనే ఉన్నాం. పాపం ఇందులో ఎక్కువగా మోసపోతుంది అమ్మాయిలే. దీంతో, సమాజం మరింత ఆందోళన చెందుతుంది. అయితే వారు కూడా అవగాహన లేకుండా చేయడం లేదని కొందరు తెలిసే చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చదువు, సామాజిక అవగాహన లేని యువతి మోసపోయిందంటే ఆశ్చర్యం ఏమీ ఉండదు. కానీ డిగ్రీలు, బీటెక్ లు చదివే అమ్మాయిలు మోసపోతున్నారంటే చదువుకొని ఏంటి ప్రయోజనం..? అని పలువురు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ జరిగిన ఒక ఘటన సోషల్ మీడియా ప్రభావం యువతులపై ఏ మేరకు ఉందో వివరిస్తుంది. ఇది హైదరాబాద్ లోని నారాయణగూడ పరిధిలో జరిగింది. నారాయణగూడకు చెందిన యువతికి ఇన్ స్టాలో చెన్నై, పుత్తూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పూర్నేష్ యాదవ్ అలియాస్ కాకూ పరిచయం అయ్యడు. మాయ మాటలు చెప్పి ప్రేమ వరకు తీసుకువచ్చాడు. అతని మాటలకు పోస్టులకు ఆ అమ్మాయి అట్రాక్ట్ అయ్యింది. తనకు కొంత డబ్బు కావాలని పూర్ణేశ్ మేలో యువతిని అడిగాడు. చదువుకునే తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో ఇదే సోషల్ మీడియా ఇన్ స్టాలో పరిచయమైన మరో మిత్రుడు హైదరాబాద్ కు చెందిన అస్లాంను డబ్బులు అడిగింది సదరు యువతి.
అస్లాం తన వద్ద డబ్బు లేదని తన ఫ్రెండ్ సాయి చరణ్ డబ్బులు ఇస్తాడని కానీ తనతో గడపాలని అస్లాం చెప్పాడు. దీంతో పూర్ణేశ్ కు డబ్బు ఇచ్చేందుకు సాయి చరణ్ తో గడిపేందుకు యువతి ఒప్పుకుంది. దీంతో మే మొదటి వారంలో అస్లాం నారాయణగూడలో ఒక రూమ్ బుక్ చేశాడు. అయితే అంతకు ముందే ఆ రూములో సెల్ కెమెరా పెట్టాడు. వారిద్దరి ప్రైవేట్ వీడియోను చిత్రీకరించాడు అస్లాం. ఇక పూర్ణేశ్ యువతికి డబ్బులు ఇచ్చాడు. ఈ డబ్బులను సదరు యువతి పూర్ణేశ్ యాదవ్ కు గూగుల్ పే చేసింది.
ఈ వీడియోను అస్లాం స్నాప్ చాట్ లో సదరు యువతికి పంపాడు. దీన్ని చూసి ఖంగుతిన్న ఆమె ఫోన్ చేసి డిలీట్ చేయాలని ప్రాధేయపడింది. అలా చేయాలంటే తన ఫ్రెండ్స్ తో గడపాలని చెప్పాడు. ఈ విషయం జరుగుతుండగానే కొద్ది రోజుల క్రితం పూర్ణేశ్ యాదవ్ హైదరాబాద్ కు వచ్చాడు. యువతి ఫోన్ లో ఆ వీడియోను చూసి నిలదీశాడు. బంధువులకు పంపుతానని చెప్పడంతో ఆందోళనకు గురైన యువతి షీటీమ్ ను ఆశ్రయించింది. వారు కేసును నారాయణ గూడ పోలీసులకు రెఫర్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అస్లాంను అరెస్ట్ చేశామని, చెన్నైలోని పూర్ణేశ్ యాదవ్ ను తీసుకస్తామని, ఇక సాయి చరణ్ ను ట్రేస్ చేస్తున్నట్లు చెప్పారు.
|
ReplyForward
|






