21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Thirumala Thirupathi : శ్రీవారి దర్శనానికి బారులు తీరుతున్న భక్తులు

    Date:

    Thirumala Thirupathi : శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. వేసవి సెలవుల కారణంగా జనం విపరీతంగా వస్తున్నారు. రోజుకు వేల మంది భక్తులు వేంచేస్తున్నారు. వీరికి సరైన సదుపాయాలు కల్పించడానికి అధికారులు తగు చర్యలు తీసుకుంటోంది. గతంలో జరిగిన పొరపాట్లు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు.

    స్వామి వారి దర్శనానికి ఇరవై నాలుగు గంటలు పడుతోంది. నిన్న దాదాపు 70 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 38 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు వచ్చింది. ఈనేపథ్యంలో భక్తుల తాకిడి పెరగడంతో కంపార్ట్ మెంట్లు మొత్తం నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి భక్తులు వేచి చూశారు.

    టీటీడీ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజులుగా భక్తుల రద్దీ పెరుగుతోంది. రోజుకు దాదాపు 80 వేల మంది వస్తున్నారు. దీంతో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటున్నారు. స్వామి వారి కాంప్లెక్స్ లు మొత్తం నిండిపోతున్నాయి. భక్తులు కంపార్ట్ మెంట్లోనే వేచి ఉంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు దర్శనానికి వస్తుంటారు. అందుకే భక్తుల సంఖ్య పెరుగుతోంది.

    ఇరవై నాలుగు గంటలు పడుతుండటంతో చిన్న పిల్లలు, ముసలి వారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా నాలుగైదు రోజులు భక్తుల తాకిడి ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైనా ఎండల ధాటికి చాలా మంది వెళ్లడం లేదు. దీంతోనే స్వామి వారిని దర్శించుకోవాలని చాలా మంది వస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya : అయోధ్య, పూరీకి పోటెత్తిన భక్తులు

    Ayodhya : దేశంలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2024లో చివరి రోజును...

    Devotees : ఆలయానికి వెళ్తుండగా విద్యుత్ వైర్లు తగిలి.. 8 మంది భక్తుల మృతి

    Devotees Died : బీహార్ లోని హాజీపూర్ జిల్లా సుల్తాన్ పూర్...

    Srivari Break Darshan: ‘గోవింద కోటి’ రాసిన వారికి శ్రీవారి బ్రేక్ దర్శనం : టిటిడి ఈఓ

      'గోవింద కోటి' రాసిన వారికి బ్రేక్ దర్శనం లో స్వామి వారిని...