
TDP : ఏపీలో మరో 9 నెలల్లో ఎన్నికలు జరగునున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ తమ రాజకీయ వ్యుహాలకు పదును పెడతున్నాయి.
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా తమ సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వే నివేదికలు, స్థానిక అంశాల దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన రాజకీయ చతురతకు మరింత పెడుతున్నారు. ఏకంగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజక వర్గాల వారీగా అభ్యర్థుల ఖరారు పైన దృష్టి పెట్టారు. ఒకేసారి ముగ్గురు అభ్యర్ధులను ఖరారు చేశారు. నియోజకవర్గాల్లో ఆయా నేతల మధ్య ఉన్న తగాదాల పరిష్కారం దిశగా పలు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. నేతల మధ్య పోటీతో వాయిదాపడుతున్న నియోజకవర్గాలపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటనకు బాబు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
కసరత్తు వేగవంతం:
ఇన్ చార్జీల ఖరారు..
చంద్రబాబు ఎన్నికల కసరత్తుపై దృష్టి సారించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీల ఎంపిక చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఒకేసారి ఇన్‌చార్జులను ఖరారు చేసి పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచారు. కాగా ఇందులో రెండు నియోజకవర్గాలకు డాక్టర్లను ఎంపిక చేయడం గమనార్హం.
సత్యవేడుకు డాక్టర్ హెలెన్, గంగాధర నెల్లూరుకు డాక్టర్ థామస్ ను నియమించారు. థామ్‌సను తొలుత చిత్తూరు లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించాలనకునున్నారు. కానీ అసెంబ్లీ స్థానానికి షిఫ్ట్ చేశారు. అలాగే పూతలపట్టు స్థానానికి తిరుపతిలో మురళీమోహన్‌ను సెలెక్ట్ చేశరు. నియోజకవర్గ ఇన్ చార్జీలతో రెండో విడత సమావేశాలు ప్రారంభించారు.
గొడవలువ వద్దు
నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితి, ప్రత్యర్థి పార్టీలతో పోలిస్తే బలాలు, బలహీనతలు, ఇన్‌చార్జి వైఖరి, ప్రజాభిప్రాయం, ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలపై వారితో కూలంకశంగా చర్చిస్తున్నారు. లోపాలు సూచిస్తూ సరి చేసుకోవాలని నిర్దేశిస్తున్నారు. నియోజకవర్గాల్లో తగాదాల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నేతల మధ్య పోటీతో ఇన్‌చార్జి నియామకం వాయిదాపడుతున్న నియోజక వర్గాలపై కూడా మరింత దృష్టి సారించారు.
గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకటరాజు, పశ్చిమ గోదావరి జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుతో చర్చలు జరిపారు. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును మార్చి వెంకటరాజును నియమించడంతో బాపిరాజు అసంతృప్తితో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో సమస్యను చక్కదిద్దే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు చేరికను నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి ముందు వ్యతిరేకించారు. బాబు అతడితో మాట్లాడి సర్ది చెప్పడంతో సుధీర్ రెడ్డి అంగీకారం తెలిపారు. ఎస్‌సీవీ నాయుడు అధికారికంగా టీడీపీలో చేరే అవకాశం ఉన్నది. విభేదాలున్న మరో రెండు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఇప్పటి వరకు చంద్రబాబు రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల నుంచి ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం ప్రారంభం కానున్న దృష్ట్యా దీనిపై కూడా క్షేత్ర స్థాయి నేతలను అప్రమత్తం చేస్తున్నారు.
ReplyForward
|