ఏనుగు చచ్చినా వేయి బతికినా వేయి అంటారు. దానికున్న గుర్తింపు అలాంటిది. ఏనుగు భారీ కాయమున్న జంతువు. దీంతో దానికి మంచి విలువ ఉంటుంది. ఏనుగు దంతాలకు గిరాకీ ఉంటుంది. ఒక కిలో దంతం దాదాపు రూ. 10 లక్షలు ఉంటుంది. ఏనుగులను చంపడం చట్టరీత్యా నేరం. ఒకవేళ అలాంటి నేరానికి పాల్పడితే శిక్షార్హులవుతారు. వేటగాళ్లు ఇవేమీ పట్టించుకోకుండా నిత్యం ఏనుగుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు.
ఏనుగు దాదాపు 70 సంవత్సరాలు బతుకుతుంది. ఏనుగుకు పైకి కనబడే రెండు దంతాలే కాకుండా లోపల 24 దంతాలు ఉంటాయి. ఏనుగు పండ్లు, ఆకులు, కొమ్మలు, వేర్లు తిని బతుకుతుంది. ప్రకృతి వైపరీత్యాలను ఏనుగులే మందు గమనిస్తాయట. ఏనుగు గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఏనుగులతో పనులు చేయించుకునే వారు. అవి కూడా కష్టపడి పనిచేస్తాయి. మిగతా జంతువుల వలె ఒళ్లు వంచి కష్టపడతాయి.
అడవుల్లో ఉండే భారీ వృక్షాలను పడగొట్టడానికి ఉపయోగించేవారు. యుద్ధాల్లో భారీ ఏనుగులను వాడేవారు. అధిక బరువులు ఎత్తడానికి ఏనుగులను పెట్టేవారు. దారి మధ్యలో ఉన్న వృక్షాలను కూల్చడానికి పెద్ద దుంగలను కదిలించడానికి వాడేవారు. ఖైదీలను తొక్కి చంపడానికి వినియోగించే వారట. ఇలా ఏనుగుల వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి. ఆడ ఏనుగులు 22 నెలల తరువాత ప్రసవం అవుతాయి.
చాలా వరకు దేశాల్లో ఆభరణాల తయారీలో ఏనుగు దంతాలు వాడతారు. మెడలో వేసుకునే హారాలు, కంకణాలు, మణికట్టుకు ధరించే బటన్లు వంటివి తయారు చేయడానికి ఏనుగు దంతాలు ఉపయోగిస్తారు. అందుకే ఏనుగు దంతాలకు అంతటి డిమాండ్ ఉంటుంది. కాబట్టే ఏనుగు దంతాల వ్యాపారాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఏనుగు దంతాలు ఇంత డిమాండ్ ఉన్నవి కావడంతోనే వాటికి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది.
ReplyForward
|