30.7 C
India
Wednesday, February 18, 2026
More

    keerthi chawla : ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా..? అప్పటి కంటే మరింత అందంగా ఉంది కదా..?

    Date:

    keerthi chawla : ‘నీ నవ్వుల తెల్లదనాన్ని నాగ మల్లి అప్పడిగింది ఇవ్వద్దూ.. ఇవ్వద్దూ.. ఇవ్వద్దూ..’ ఈ పాట గుర్తుందా. ‘ఆది’ సినిమాలో అప్పట్లో దుమ్మురేపిన పాట. పాట ఆసాంతం హీరోయిన్ అందాలను పొగుడుతూ జూనియర్ ఎన్టీఆర్ కీర్తించడం. ఆలాగే ఆ హీరోయిన్ అందాలు కూడా ఉండడం సినీ అభిమానులకు అప్పట్లో ఆసక్తి రేపింది. ఆ హీరోయినే కీర్తిచావ్లా.

    కీర్తి చావ్లా ఆది సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. వివి వినాయక్-జూ. ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్, సూపర్ కలెక్షన్ హిట్ మూవీ. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా నటించింది. అమాయకమైన మోముతో, అందం ఉట్టిపడేలా నటిస్తూ మెప్పించింది ఆమె. అయితే, ఇది ఆమె మొదటి ఈ సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ తర్వాత సరైన అవకాశాలు లేక తెరమరుగైంది. కానీ సోషల్ మీడియా వేదికగా తన ఫాన్స్ ను ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది కీర్తి చావ్లా.

    ఈ సినిమా తర్వాత జేడీ చక్రవర్తి సరసన ‘కాశి’లో నటించింది కీర్తి చావ్లా. ఇక మన్మధుడులో ఒక సాంగ్ లో మాత్రమే కనిపించింది. శ్రావణ మాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు, బ్రోకర్ వంటి చిత్రాల్లో కనిపించినా ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. ఈ గ్యాప్ లోనే తమిళ, కన్నడ ఇండస్ట్రీలను కూడా పలకరించింది ఈ అమ్మడు.

    తెలుగు ఇండస్ట్రీలో చాలా గ్యాప్ తర్వాత (దాదాపు 10 సంవత్సరాలు) ‘ఓ అమ్మాయి ప్రేమకథ’లో కనిపించింది. అయితే కరోనా సమయంలో సినిమా షూటింగ్ జరిగింది. గ్లామర్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె బాగా ఒదిగిపోయింది. ఆ తర్వాత ఫేడవుట్ అయిపోయింది. దీనితో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి  విషయాలు బయటకు రాలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేసే కీర్తి చావ్లా ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు. అప్పటిలాగే బొద్దుగా, ముద్దుగా ఉంది. ఆఫర్స్ తగ్గిపోవడంతో తన స్నేహితులతో కలిసి బిజినెస్ ప్లాన్స్ చేస్తుందని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related