
Eating fish is good for our health : మాంసాహారాల్లో చేపలు ముఖ్యమైనవి. తొందరగా జీర్ణమయ్యే వాటిలో చేపలు ముందుంటాయి. మటన్ 72 గంటలు, చికెన్ 32 గంటలు, చేపలు 7 గంటల్లో జీర్ణం అవుతాయి. అందుకే చేపలు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవని వైద్యులే చెబుతున్నారు. చేపల కూర, పులుసు, ఫ్రై, పచ్చడి నానా రకాలుగా వాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో చేపలను తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాట్స్ ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. వాపులను తగ్గిస్తాయి. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జ్ణాపక శక్తిని పెంచుతాయి. ముసలి వారిలో వచ్చే అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తాయి. ఇలా చేపలను తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అందరు చేపలను తీసుకోవచ్చు.
చేపలు తరచుగా తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. గుండె జబ్బులు రాకుండా చేయడంలో ఇవి కీలకంగా ఉంటాయి. అందుకే ఒమేగా 3 ఫ్యాట్ ఉండటం వల్ల వీటిని తినడంతో రక్తప్రసరణ మెరుగు పడుతుంది. రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించడంలో చేపలు సహకరిస్తాయి. రక్తనాళాల్లో అడ్డంకులు లేకుండా చేసి గుండె జబ్బులను దూరం చేస్తాయి.
కళ్ల సమస్యలను దూరం చేయడంలో కూడా చేపలు తోడ్పడతాయి. ఈ రోజుల్లో చిన్న వారికే కంటి జబ్బులు వస్తున్నాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాట్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇందులో విటమిన్ డి తక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. ఇది చేపల్లో అధికంగా ఉంటుంది. అందువల్ల చేపలను తరచుగా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.
ReplyForward
|