27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Election Schemes : తెలంగాణలో ప్రజలకు ఎన్నికల వరాలు.. రూ. 40 వేల కోట్లు పంచేందుకు సిద్ధం!

    Date:

    Election Schemes
    Election Schemes, CM KCR

    Election Schemes : తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే తన మార్క్ చూపిస్తున్నారు. ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు నిన్న నిర్మల్ పర్యటనలోనే సుమారు రూ. 120 కోట్లు ఆ జిల్లా వాసులకు ప్రకటించారు.

    అయితే ఈ ఐదు నెలల్లో సుమారు రూ. 40 వేల కోట్లు ప్రజలకు అందించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. పెండింగ్లో ఉన్న అన్ని నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ల తోపాటు రుణమాఫీ, రైతుబంధు ఇలా అన్ని రకాల సాయం చేయబోతున్నది. బీసీలకు రూ.లక్ష సాయం, గృహలక్ష్మి, దళిత బంధు ఇలా అన్ని పథకాలను ఆయా వర్గాలకు అందించబోతున్నది. పల్లెలకు, మున్సిపాలిటీలకు విరివిగా నిధులు కేటాయించబోతున్నది. మనబడి ద్వారా కూడా ప్రభుత్వ పాఠశాలను బాగు చేసే కార్యక్రమానికి వేగవంతం చేయబోతున్నది.

    ఎన్నికల షెడ్యూలు రాకముందే ఇదంతా ఖర్చు చేయాలని భావిస్తున్నది. జూలై నుంచి సెప్టెంబర్ లోగా ఇదంతా ప్రజలకు చేర్చాలని ఏర్పాట్లు చేసుకున్నది. ముఖ్యంగా ఇందులో వానకాలం సీజన్ రైతుబంధుకు రూ. 7500 కోట్లు ఇవ్వబోతున్నది. దళిత బందుకు రూ.5000 కోట్లు, గృహలక్ష్మికి మూడు నుంచి నాలుగు వేల కోట్లు ఖర్చు చేయబోతున్నది.

    ఎందుకు అవసరమైన నిధుల సేకరణపై కూడా సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇప్పటికే ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియ ద్వారా కొంత వస్తుందని భావిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ భూములు లీజు, ఇతర మార్గాల ద్వారా అప్పులు తెచ్చి అటు ఉద్యోగులకు జీతాలతో పాటు ఇటు ప్రజలకు వరాలు కురిపించాలని భావిస్తున్నారట. మరి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ భారీ స్కెచ్ ని ప్లాన్ చేశారు. ఎన్నికల ముందు ఈ వరాలు ప్రజల్లో తమపై మరింత ఆదరణ ను పెంచుతాయని, హ్యాట్రిక్ కొట్టేందుకు ఇది  తమ కు లాభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Loan waivers : రుణమాఫీ కానివారికి శుభవార్త.. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు

    loan waivers : తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కుటుంబ...

    New scheme : సర్కార్ కొత్త స్కీం..ఇంటింటికీ ఇంటర్నెట్, టీవీ కూడా

    New scheme in Telangana : రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజల...

    Unbearable Burden : దొర పాలనలో మోయలేని భారం.. చరమగీతానికి ఇదే తరుణం..

    Unbearable Burden : దేశంలో ఏర్పడిన కొత్త రాష్ట్రం ‘తెలంగాణ’. సొంత...

    Telangana Schemes : ఇదీ ప్రజోపయోగం కార్యక్రమం..తెలంగాణ పథకాలపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు.

    Telangana Schemes : తెలంగాణ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు కిందిస్థాయిలో ప్రజలకు...