
Etela Rajender Vs Revanth Reddy: ఎప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ,కేసీఆర్‌ను కార్నర్ చేసే మాజీ మంత్రి,బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈసారి రూట్ మార్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ను ఈసారి గట్టిగనే అరుకున్నరు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అస్త్రసన్యాశం చేసిందని ఆరోపించారు. ఈ బై పోల్‌లో కాంగ్రెస్ లాలూచీ రాజకీయాలు చేసిందని విమర్శించారు. మునుగోడులో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించేందుకు రాష్ట్ర నాయకులెవ్వరూ పట్టుదలతో కృషి చేయలేదని చెప్పుకొచ్చారు.
టీకాంగ్రెస్ ఇలా దిగజారడానికి ప్రధాన కారణం కేసీఆర్ ఆపార్టీకి ఇచ్చిన 25 కోట్ల ముడుపులేనన్నారు. ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ నుంచి 25 కోట్లు ముట్టడం వల్లే ఆపార్టీ నాయకులంతా చేయాల్సిన స్థాయిలో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించలేదన్నారు. తాను చెప్పింది అవాస్తమని చెప్పే ధైర్యం ఒక్క కాంగ్రెస్ నేతకూ లేదని విమర్శించారు. ఇక ఈటల చేసిన సంచలన కామెంట్స్ టీకాంగ్రెస్‌లో కాక రేపాయి. ఆపార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ రేవంత్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈటలకు దమ్ముంటే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టబడి ఉండాలని సవాల్ చేశారు. ఈటెల చేసిన వ్యాఖ్యల్లో నిజాయితీ ఉందని భావిస్తే..తడి బట్టలతో చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం ముందు ప్రమాణం చేయాలన్నారు.
అయితే ఈటల,రేవంత్ మధ్య సవాళ్లు ఎలా ఉన్నా..రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈరకమైన వ్యాఖ్యలు ఈటల చేసినట్లు తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేననే సంకేతాలు పంపేందుకు ఈరకమైన కామెంట్స్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉండేందుకు ఈటల టీకాంగ్రెస్‌ను కార్నర్ చేసినట్లు సమాచారం. అందుకే ఎప్పుడు కేసీఆర్,బీఆర్ఎస్‌పైనే విమర్శలు గుప్పించే ఈటల ఈసారి రూట్ మార్చి టీకాంగ్రెస్‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రూ.25 కోట్లను ముడుపులుగా తీసుకుందని ఆరోపించినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్.






