
Scientists : రాజస్థాన్ లోని దౌస జిల్లాలో ఉన్న మెహదీపూర్ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆలయంలోకి వెళ్లగానే మనకు కనిపించే దృశ్యాలు మనల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తాయి. ఎందరో సైంటిస్టులు ఈ ఆలయంపై పరిశోధనలు చేశారు. అయితే కొన్ని మూడ శక్తులు అవహించిన వారు ఇక్కడికి వస్తే సాధారణంగా మారిపోతారని అంతా అనుకుంటుంటారు. కానీ ఇక్కడ జరిగేది కూడా అదే. అయితే ఈ విషయం తెలుసుకున్న చాలా మంది మానసిక వైద్య నిపుణులు ఇక్కడికి చేరుకొని పరిశోధనలు చేశారు. ఇక్కడ వచ్చిన ఫలితాలు చూసి డాక్టర్లు కూడా అశ్చర్యపోతుంటారు.
అసలు మెహదీపూర్ ఆలయంలో ఏముంది. ఈ ఆలయంపై పరిశోధనలు చేయాలని సైంటిస్టులు ఎందుకు అనుకున్నారు.. రెండు కొండల మధ్య ఈ ఆలయంలో హనుమంతుడు కొలువై ఉన్నాడు. మరోవైపు భైరవ బాబాతో పాటు మరో దేవుడి ప్రతిమలు అక్కడ మనకు కనిపిస్తాయి. ముగ్గురు దేవుళ్లకు మూడు రకాల పూజలు, మూడు రకాల ప్రసాదాలు ఉంటాయి. ఇక్కడికి వెళ్లి మనం చూస్తే ముందుగా భయపడడం ఖాయం. ఆధునిక కాలంలో కూడా ప్రజలు సాంకేతికతనే నమ్ముతారు. అయితే ఈ ఆలయానికి వచ్చే వారంత భూత, ప్రేత, పిశాచాలు ఆవహించిన వారే ఎక్కువగా ఉంటారు. వాటిని వదిలించుకోవడానికే ఇక్కడి వస్తుంటారని ఆలయ పూజారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇచ్చే ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడం కుదరదు. తీసుకెళ్లనివ్వరు కూడా. అవి ఇంటికి తీసుకెళ్తే కీడు జరుగుతుందని భావిస్తారు. వెయ్యి ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం స్వయంభూగా వెలిసినట్లుగా చెబుతారు.






