thaman టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో థమన్ ఒకరు.. ఇతడు చేసే సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో థమన్ కు బాగా డిమాండ్ పెరిగింది.. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా బిజీ బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న 70 శాతం ప్రాజెక్టులకు థమన్ నే సంగీతం అందిస్తున్నాడు..
మరి థమన్ మ్యూజిక్ ఇస్తున్న సినిమాల్లో త్రివిక్రమ్ – మహేష్ ‘గుంటూరు కారం’ ఒకటి. ఈ సినిమాలో నుండి థమన్ ను తీసేసారు అంటూ గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ న్యూస్ ను వైరల్ చేసిన వారిపై తాజాగా థమన్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తనపై వస్తున్న రూమర్స్ కు స్పందిస్తూ..
గుంటూరు కారం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయి.. ఈ లోపే బయట ఏదో ప్రచారం జరుగుతుంది.. అవన్నీ అవాస్తవం.. నన్ను సినిమా నుండి తీసేశారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్న నిర్మాత అధికారికంగా చెబుతారు కదా ప్రతీ గొట్టం గాడికి సమాధానం చెప్పాలా? అంటూ థమన్ ఫైర్ అయ్యారు.
ఇంకా ఈయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు గుంటూరు కారం సినిమాపైనే పడ్డారు.. ఒకే సినిమాను పట్టి పట్టి టార్గెట్ చేస్తున్నారు.. నాలుగేళ్లుగా ఆగిపోయిన సినిమాలు ఉన్న గుంటూరు కారం మీదనే అందరు చూస్తున్నారు. అది ఎందుకో తెలియదు..అంటూ థమన్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ తో గుంటూరు కారం నుండి థమన్ బయటకు రాలేదని తెలుస్తుంది.