Pawan Kalyan Keerthi Reddy : తొలిప్రేమ.. ఇప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచి పోయింది. ఈయన కెరీర్ స్టార్టింగ్ లో చేసిన ఈ లవ్ స్టోరీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇదే పవర్ స్టార్ కు తొలి బ్లాక్ బస్టర్.. తొలిప్రేమ సినిమాలో లవ్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉంది.. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్ని యాంగిల్స్ ను రంగరించి ప్రేక్షకులకు సరికొత్తగా అందించారు.
1998 జులై 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. 2023, జులై 24 వస్తే ఈ సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా 25 ఏళ్ళు అవుతుంది. అప్పట్లోనే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా ఈ సినిమాతో డబల్ అయ్యింది..
ఈయన కెరీర్ లో ఈ హిట్ పడకపోయి ఉంటే పవన్ కు ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కాదేమో.. ఎందుకంటే ఈ సినిమా తర్వాతనే ఈయన స్టార్ హీరో అయ్యి ఆ తర్వాత మాస్ హీరోగా నిరూపించుకున్నాడు. ఈ సినిమా 25 ఏళ్ళు అయిన సందర్భంగా మేకర్స్ జూన్ 30న ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది.
మరి ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా నెలకు ఇంత అని ఇవ్వమన్నాడు అని చెప్పిన నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పలేదు. అయితే ఆ డబ్బులతో పవన్ పుస్తకాలూ, మొబైల్ ఫోన్ కొన్నట్టు చెప్పుకొచ్చాడు.. ఇక ఈ మూవీ షూటింగ్ లో నిజమైన ప్రేమికులుగా కూడా మారారని.. పవన్ చెల్లెలి రోల్ లో నటించిన వాసుకి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారని జివిజి రాజు చెప్పుకొచ్చాడు..
ReplyForward
|