Pushpa’s movie : అమెరికాలో ఇండియన్ గ్రూప్ వేసిన డాన్స్ కు అక్కడి వారంతా ఫిదా అయ్యారు. హర్యానాకు చెందిన ఒక చిన్న గ్రామం నుండి ఇండియన్ గ్రూప్ ”ఇండియన్ డాన్స్ గ్రూప్ వారియర్ స్క్వాడ్” పేరుతో ఆ టీమ్ అమెరికాలో ”అమెరికాస్ గాట్ టాలెంట్’ లో ఆడిషన్స్ ఇవ్వడానికి వెళ్లారు.. మరి మన కుర్రాళ్ళు ఇచ్చిన ఆడిషన్స్ చుసిన అక్కడ జడ్జెస్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు..మరి వీరి డాన్స్ కు అక్కడ షో చూడడానికి వచ్చిన వారు సైతం ఫిదా అయ్యారు.. ఇంతలా మన ఇండియన్ కుర్రాళ్ళు వేసిన ఆ డాన్స్ స్టెప్పులు ఏంటి? ఏ పాటకు వీరు డ్యాన్స్ చేసారు? అంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ‘పుష్ప ది రైజ్’ నుండి వీరు పాటను ఎంచుకుని డాన్స్ చేసి అక్కడి వారిని ఇంప్రెస్ చేసారు.
మరి ఆ పాట ఏంటంటే.. ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అనే పాటకు వీరు డేంజరస్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అక్కడి వారిని పడేసారు. మరి ఈ గ్రూప్ చేసిన డాన్స్ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.. ఈ గ్రూప్ అంతా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా సాంగ్ కు గొప్ప ప్రదర్శన ఇచ్చి అక్కడ జడ్జ్ లను మెప్పించారు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అక్కడ జడ్జెస్ అయిన సోఫియా, హెడీ క్లమ్ సైమన్ కోవెల్ ఫిదా అయ్యారు.
చాలా బాగా చేసారని.. గ్రూప్ లో ప్రతీ ఒక్కరు చాలా అద్భుతంగా చేసారని.. మీకు ఎదురు లేదు అంటూ వారు కామెంట్స్ చేయడం విశేషం.. అమెరికాలోని ఒక ఎన్జిఓ సహాయంలో ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు అవకాశం వచ్చింది అని ఆ గ్రూప్ సభ్యులు తెలిపారు. కాగా అమెరికాస్ గాట్ టాలెంట్ షో 18వ సీజన్ ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఇందులో విన్ అయిన వారికీ పెద్ద మొత్తంలో బహుమతి లభిస్తుంది. ఏది ఏమైనా మన బన్నీ సాంగ్ అమెరికాలో మరో సారి రీసౌండ్ వచ్చింది.






