చిన్నారి పెళ్లికూతురు సినిమాతో తెలుగు తెరకు అరంగేట్రం చేసిన హీరోయిన్ అవికా గోర్. తొలి చిత్రంతోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా ప్రసారమైన బాలికా వధువు సీరియల్ లో నటించి దేశంలోనే అభిమానులను సంపాదించుకుంది. మంచిమర్కులు కొట్టేసింది. ప్రస్తుతం తెలుగుతెరకు కనిపించకుండా పోయింది. అవకాశాల్లేకపోవడంతో దాదాపు నటనకు దూరమైందనే చెప్పాలి.
తెలుగులో పలు సినిమాల్లో నటించింది. బరువు తగ్గించుకున్నా ఆమెకు అవకాశాలు రాలేదు. నాజూకుగా మారినా ఆమె తన ప్రస్థానం కొనసాగించలేకపోయింది. ఇటీవల కాలంలో ఆఫర్లు లేకపోవడంతో ఇంటికే పరిమితమైపోయింది. ఓటీటీ సినిమాలు మరియు సిరీస్ ల్లో అరుదుగా కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో మాత్రం చురుకుగా ఉంటోంది. తన ఫొటోలు పంచుకుంటోంది.
సోషల్ మీడియాలో తన ఎద అందాలు ప్రదర్శిస్తోంది. అయినా సినిమాల్లోకి ఎవరు తీసుకోవడం లేదు. చిన్నారి పెళ్లి కూతురులో ఆమె అందానికి అందరు ఫిదా అయ్యారు. సినిమాల్లోకి వచ్చాక మాత్రం ఆమెకు ఆఫర్లు తగ్గాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నట్లు ఆమె సినిమాల్లో ఉండగా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతోనే వెనుకబడిపోయింది.
ప్రసార మాధ్యమాల్లో సైతం తన అందాలు ఆరబోస్తోంది. పొట్టి డ్రెస్ లతో ప్రేక్షకుల మతులు పోగొడుతోంది. కానీ సినిమా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతోంది. ఆమె అందాలను అభిమానులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నా నిర్మాతల దృష్టిని ఆకర్షించలేకపోతోందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇలా అవికా గోర్ కష్టాలను ఎవరు పట్టించుకుంటారో తెలియడం లేదు.
|
ReplyForward
|






