
Jagan : మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తమను పట్టించుకోలేదనే కేడర్ లో ఉన్న భావన తెలిగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వైసీపీ కేడర్ పైన కేసులు పెట్టి వేధిస్తోందని.. ఇబ్బంది పడుతున్న ప్రతీ కార్యకర్తకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైసీపీని అభిమానించే ప్రతీ ఒక్కరి ఇంటికి తాను పెద్ద కొడుకుగా ఉంటానని పేర్కొన్నారు. ఉగాది నుంచి తాను వరుసగా జిల్లాల వారీగా కార్యకర్తలతో మమేకం అవుతానని ప్రకటించారు.
2024 ఎన్నిక ల్లో తాను అబద్దాలు చెప్పని కారణంగానే కూటమి కంటే 10 శాతం ఓట్లు తక్కువ వచ్చాయని జగన్ చెప్పుకొచ్చారు. తాను విలువలతో రాజకీయం చేసానని చెప్పారు.
ప్రజల్లో వ్యతిరేకత
టీడీపీ నేతలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసారని జగన్ మండిపడ్డారు. ఇలా ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ఛీటర్ అని అనరా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రెండేళ్లు కరోనా ఉన్నా చెప్పిన ప్రతీ మాట అమలు చేసామని..డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసామని వివరించారు. ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం పైన పూర్తి స్థాయి లో వ్యతిరేక కనిపిస్తోందన్నారు. బెల్టు షాపులు, ఇసుక అక్రమాలు, పేకాట క్లబ్లులు మొదలయ్యాయ ని వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని వ్యాఖ్యానించారు.
వదిలేదు లేదు
వైసీపీ కార్యకర్తలు, మద్దతు దారుల పైన కేసులు పెట్టి వేధిస్తున్నారని.. అలా చట్ట విరుద్దంగా వ్యవహరించిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగనన్న 2.0 లో పూర్తిగా కార్యకర్తలకు మద్దతుగా ఉండే జగన్ ను చూస్తారని హామీ ఇచ్చారు. తొలి సారి ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో కార్యకర్తలకు మేలు ఆశించిన స్థాయిలో చేయలేకపోయామని చెప్పుకొచ్చారు. ముసాలావి డ కూడ బటన్ నొక్కుతుందని అవహేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు సంపద ఎలా తేవాలో చెప్పమని అడుగుతున్నారని చెప్పారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. ఇలాగే పాలన సాగిస్తే ప్రజలు సహించరని జగన్ హెచ్చరించారు.