KCR & KTR : రాష్ర్ట ఐటీ మంత్రి కేటీఆర్ మాటల్లో దిట్ట. తనదైన ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై విమర్శలు చేయడంలో ఆయనకు సాటి మరొకరు ఉండరు. అయితే ఒక్కోసారి ఆయన ప్రతిపక్ష నేతల్ని కూడా పొగుడుతుంటారు. వారికి ఇయ్యాల్సిన క్రెడిట్ను వారికే ఇస్తుంటారు. తాజాగా ఆయన చంద్రబాబు, వైఎస్ లను పొగిడారు. గతంలో కూడా వారిద్దరినీ ఆయన మెచ్చుకున్నారు. పార్టీ విషయంలో వారిద్దరినీ విమర్శించినా, కొన్ని పనుల విషయంలో మాత్రం వారికి క్రెడిట్ ఇస్తుంటారు మంత్రి కేటీఆర్.
అయితే ఆయన తాజాగా మాట్లాడుతూ కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో కేవలం ట్రైలర్ చూపించారని, అసలు సినిమా ముందుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు , వైఎస్‌లతో.. కేసీఆర్ ను పోల్చారు. వారిద్దరి కంటే కేసీఆర్ చాలా బెటర్ అంటూనే , ఎందుకో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐటీ, బిజినెస్ రంగాలను ముందుకు నడిపించారు. తనను తాను ఒక సీఈవోగా అభివర్ణించుకునేదని చెప్పారు. హైదరాబాద్ కు ఐటీ ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కూడా ఆయన గతంలో టీడీపీ అధినేత చంద్రబాబును మెచ్చుకున్నారు. దీంతో పాటు చంద్రబాబు తెచ్చిన అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రపంచంలోనే గొప్పదని, కానీ అది జగన్ వచ్చాక ఆగిపోయిందని కూడా గతంలో ఆయన వ్యాఖ్యానించారు. అయితే వైఎస్ఆర్ రైతులు, సంక్షేమం, పేదలపై దృష్టి పెట్టారు. అయితే ఇరువురు కొన్ని రంగాలనే ఎంచుకొని రాష్ట్రాన్ని పాలించారున్నారు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే.. మరో వైపు వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. అయితే వారికి 67 ఏళ్లలో సాధ్యం కాని అభివృద్ధిని 9 ఏళ్లలోనే చేసి చూపించారని కొనియాడారు. అయితే తండ్రిపై అభిమానం చూపిస్తూనే, ఇతర నేతలను కించపర్చారని మరికొందరు అంటుంటే, తమ నేతలు బాటలు వేసిన అభివృద్ధినే కేసీఆర్ కొనసాగిస్తున్నారని ఆయా పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు.
ReplyForward
|