Heroine Laya : హీరోయిన్ లయ గురించి తెలుసు. తెలుగమ్మాయి అయినా మంచి విజయాలతో చాలా మంది హీరోలతో జతకట్టి తానేమిటో నిరూపించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైనా పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటోంది. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ మిస్ పెగెంట్ 2023 కాంపిటిషన్ కి ముఖ్య అతిథిగా హాజరయి అందరిని ఆశ్చర్యపరచింది. పొడుగు గౌను వేసుకుని కాలేజీ బ్యూటీగా దర్శనమిచ్చి అక్కడి వారిని ఆనందపరచింది. విజేతలను అభినందించింది.
విజయవాడకు చెందిన లయ చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. 1992లో భద్రం కొడుకో సినిమాతో రంగప్రవేశం చేసిన ఆమె స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి చిత్రమే విజయం సాధించడంతో ఇక వెనుకకు తిరిగి చూడలేదు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ సినిమాలు చేస్తూ శభాష్ అనిపించుకుంది. అనేక విజయాలు అందుకుంది.
ప్రేమించు సినిమా మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. తెలుగులో వరుస విజయాలతో లయ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కాయి. హనుమాన్ జంక్షన్, నువ్వులేక నేను లేను వంటి కమర్షియల్ సినిమాలు కూడా చేసింది. పరిశ్రమలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. మంచి పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
తెలుగులో లయ నటించిన సినిమాలెన్నో హిట్ గా నిలిచాయి. ప్రముఖ హీరోలందరితో జతకట్టింది. అగ్రహీరోల్లో బాలకృష్ణ వరకు చాలా మందితో కలిసి నటించింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు వారికి అవకాశాలు రావడమే గగనం. కానీ ఆమె తన సహజమైన నటనతో అందరిని మెప్పించింది. చాలా సినిమాల్లో తన ప్రతిభ చూపించింది.
|
ReplyForward
|






