Mahesh Babu
Mahesh Babu : రాజమౌళితో కలిసి ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న మహేష్ బాబు ఇప్పుడు ఆ అడ్వంచర్ జర్నీలో భాగంగా ఇలాంటి అడ్వంచర్లు చేసే ప్రపంచ యాత్రికుడు , యూట్యూబర్ అన్వేష్ చానెల్ ను సబ్ స్క్రైబ్ చేయడం సంచలనంగా మారింది.
మహేష్ బాబు తాజాగా “నా అన్వేషణ” అనే యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసినట్లు సమాచారం. ఇది ఎంతో ఆసక్తికరమైన విషయం, ఎందుకంటే ఈ తరహా ప్రముఖులు తమకు ఆసక్తికరమైన విషయాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆ చానెల్‌కు మరింత గుర్తింపు తీసుకురావడంలో సహాయపడతారు.
“నా అన్వేషణ” ఛానెల్ మీద ఆయనకు ఆసక్తి ఉండటానికి కారణం రాజమౌళితో త్వరలో తీయబోయే మూవీనే అయ్యి ఉండొచ్చని అంటున్నారు. ఈ ఛానల్ ప్రపంచంలోని వింతలు, విశేషాలు, భిన్న ప్రాంతాలను పరిచయం చేస్తూ సాగుతుంది. అన్వేష్ గోదావరి యాసలో తెలుగువారికి ప్రపంచంలోని కొత్త కొత్త ప్రాంతాలను పరిచయం చేస్తుంటాడు.