Mega Princess : మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటి నుంచి నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆమె పుట్టుకతో సెలబ్రెటీల దృష్టి తనవైపునకు తిప్పుకుంది. టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా స్టార్ హీరోలు ఆమెకు వెల్ కమ్ చెప్తూ ట్వీట్లు చేశారు. మెగా ఇంట్లోకి వచ్చిన ఆమెను చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఆశీర్వదించారు. ఆమె చుట్టూ ఎన్నో కథనాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి.
జూన్ 20వ తేదీ మంగళవారం తెల్లవారు జామున 1.49 నిమిషాలకు ప్రిన్సెస్ భూమిపై అడుగుపెట్టింది. ఉదయమే ఈ వార్త ప్రపంచానికి తెలియడంతో చాలా మంది ఖుషీ అయ్యారు. మెగా ఇంట మరో ప్రిన్సెస్ అంటూ విషెస్ చెప్పడం మొదలు పెట్టారు. తమకు ఇప్పుడే అసలైన పండుగ అంటూ చిరంజీవి ట్వీట్ చేస్తూ అందులో రాం చరణ్-ఉపాసన దంపతులకు విషెస్ చెప్పారు. ఆయనతో పాటు ప్రముఖుల విషెస్ దాదాపు వారం పాటు సోషల్ మీడియాలో మారుమోగాయి.
పుట్టినప్పటి నుంచి ఆశీర్వాదాలు అందజేసిన ప్రముఖులు ఇప్పుడిప్పుడు గిఫ్ట్ లు పంపడం మొదలు పెడుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టిన 21 రోజుల తర్వాత బారసాల చేస్తారు. ఇందులో భాగంగా చిన్నారిని ఊయలలో వేస్తారు. ఇది కూడా చాలా పెద్ద వేడుకగా చేస్తారు. అయితే ప్రిన్సెస్ పుట్టి నేటికి సరిగ్గా 21 రోజులు అంటే ఈ రోజే ఆమె బారసాల. ఈ నేపథ్యంలో రిలయన్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు అయిన ముఖేశ్ అంబాని ప్రిన్సెస్ కు ఒక కాస్లీ గిఫ్ట్ పంపించారట.
అదే బంగారు ఊయల
మెగాస్టార్ చిరంజీవితో మేఖేశ్ అంబానీకి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. పైగా రాం చరణ్ కూడా ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరో. సో ఆయన కూతురుకు ఏదైనా కాస్లీ గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు ముఖేశ్ అంబానీ. 21వ రోజు వేడుకకు బంగారు ఊయలను గిఫ్ట్ గా పంపాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని చిరంజీవితో సన్నిహితంగా ఉండే ఓ ఫిల్మ్ జర్నలిస్టు కూడా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దీంతో ఈ వార్త దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అంబాని పంపిన ఊయల దాదాపు 2 కేజీలకు పైగా బంగారంతో తయారు చేయించినట్లు టాక్ వినిపిస్తుంది. దీని కోసం అంబానీ రూ. 1.20 కోట్లు వెచ్చించారని ఇండస్ట్రీ నుంచి టాక్ ఉంది.
బారసాలకు కొందరే..
మెగా ప్రిన్సెస్ బారసాల (జూన్ 30) వేడుక సాదా సీదాగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి ఆర్బాటం లేకుండా కేవలం దగ్గరి బంధువులు మాత్రమే ఇందులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తన కూతురికి బారసాల రోజే పేరు పెడతామని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలోనే స్పష్టం చేశాడు. దీనిని బట్టి చూస్తే మెగా ప్రిన్సెస్‌కు నామకరణం చేసే అవకాశం కూడా ఉంది. చిన్నారికి ఏ పేరు పెడతారో అంటూ సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది. తన పేరును తెలుసుకునేందుకు మెగా ఫ్యాన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ReplyForward
|