అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో సాయి దత్త పీఠం ని దర్శించుకున్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి సాయిదత్త పీఠం ఆహ్వానం మేరకు శివ విష్ణు ఆలయాన్ని సందర్శించారు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ఎడిసన్ లో ఈ ఆలయం ఉంది.
ప్రతీ పండుగలను విశేషంగా జరిపిస్తుంటారు సాయిదత్త పీఠం నిర్వాహకులు. జస్టిస్ రమణ దంపతులను వేద మంత్రోచ్ఛారణతో ఘనస్వాగతం పలికారు వేదపండితులు. శివ విష్ణు ఆలయంలోని దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జస్టిస్ రమణ. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శంకరమంచి రఘు శర్మ తో పాటుగా పలువురు ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.