
Nikhil 20
Actor Nikhil : భారతదేశం కొత్త పార్లమెంటరీ భవనం ప్రారంభోత్సవం నుంచి ‘సెంగోల్’ గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. అధికారం మార్పు కోసం దీన్ని ఉపయోగిస్తే బాగుంటుందని ప్రధాని మోడీ సెంగోల్ ను పార్లమెంట్ లోని స్పీకర్ చైర్ పక్కన ఏర్పాటు చేశారు. బ్రిటీశ్ వారు స్వాతంత్రం ఇచ్చి పోతూ అధికార బదిలీ జరిగింది కాబట్టి ఏదైనా గుర్తుగా ఉంటే బాగుంటుందని అన్నారట. అయితే అప్పటి మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సెంగోల్ ను గుర్తుగా ఇస్తే బాగుంటుందని చెప్పారు. ఆ తర్వాత అది కాలక్రమేనా నెహ్రూ మ్యూజియంలో భద్రంగా ఉంది. ఇప్పుడు దీన్ని మెడీ వెలికి తీసి అధికార బదిలీకి ఉపయోగించాలని చెప్పారు.
ఇంతంతా అటుంచితే నూతన దర్శకుడు భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న 20వ సినిమా ప్రీ లుక్ పోస్టర్ లో ‘సెంగోల్ ఆఫ్ వారియర్’ సినిమాను తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మన చరిత్రలో చెప్పినట్లు సెంగోల్ ను నీతికి చిహ్నంగా, అది ‘వాకింగ్ స్టిక్’ కాదనే వాస్తవాన్ని రుజువు చేసే చిత్రం #Nikhil20 అని చూపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెంగోల్ పాలకుడి బాధ్యతను ప్రతిబింభించే పురాతన భారతీయ నాగరికత చిహ్నం. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ ఎపిక్ ఫాంటసీలో నిఖిల్ ఓ ప్రతిష్టాత్మక పాలకుడిగా నటిస్తున్నాడు. రేపు నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.
కేజీఎఫ్, కంతార ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని హై బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించనున్నారు.

Nikhil 20






