
తెలుగు రాష్ట్రల క్రికెట్ అభిమానులకు అంబటిరాయుడు అంటే సుపరిచితమే. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. మొన్నటి ఐపీఎల్ సీజన్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన రాయుడు, ధోనీ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ అందుకున్న జట్టులో ఉన్నాడు. అయితే ఇటీవల ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. దీనికి ఊతమిస్తూ ఆయన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ను రెండు సార్లు కలిశాడు. ఇక వైసీపీలో అంబటి చేరిక దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తున్నది.
అయితే అంబటి రాయుడుకి తాజాగా టీవీ9 కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన రాజకీయ రంగ ప్రవేశానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన భావించినట్లు ఉన్నారు. అయితే ఇక్కడే అసలు కథ బయటకు వచ్చింది. తన ప్రమోషన్ కోసం చేసుకున్న ఈ ఇంటర్వ్యూ అంబటి అసలు నైజాన్ని బయట పెట్టిందని అంతా అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం మొత్తం అంబటి క్రికెట్ వివాదాల చుట్టే సాగింది. క్రికెట్ కెరీర్ లో తాను ఎదగకపోవడానికి గల కారణాలను అంబటి ఇందులో చెప్పుకొచ్చాడు. ఎక్కడికి వెళ్లినా… తనను వివాదాల్లోకి లాగేవారని స్వయంగా అంబటి ఒప్పుకున్నారు. ముందుగా హైదరాబాద్ జట్టుకు ఆడినప్పుడు శివలాల్ యాదవ్ తో , ఆ తర్వాత ఆంధ్రా జట్టుకు వెళ్తే అక్కడ కెప్టెన్ ఎమ్మెస్కేతో వివాదం ఏర్పడింది. దీంతో చేసేదేమి లేక మళ్లీ హైదరాబాద్ టీమ్ కు వచ్చాడట. మళ్లీ అక్కడి నుంచి బరోడాకు వెళ్లినట్లు చెప్పాడు. అక్కడా పొసగక మళ్లీ బయటకు వచ్చాడు. అయితే అన్ని చోట్ల తనకు విభేదాలే అని చెప్పుకోవడం చాలా మందిలో సందేహాన్ని కలిగించింది. ప్రోగ్రాం చూస్తున్న వారంతా ఒక్కరితో గొడవంటే ఏదో అనుకోవచ్చు కాని, అన్ని జట్లలో విభేదాలే అంటే ఆలోచించాల్సిన విషయం అని అభిప్రాయపడ్డాడు.
ప్రపంచకప్ కు తనను ఎంపిక చేయకపోవడానికి అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కేనే కారణం అని అంబటి గతంలో, తాజాగా మరోసారి ఆరోపించాడు. అయితే అంబటి రాయుడు మాత్రం తన వైఫల్యాలకు ఇతరుల్ని బాధ్యుల్ని చేస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఆ విషయం ప్రోగ్రాం చూసేవారికి అర్థమవుతుంది.
అయితే తన రాజకీయ రంగ ప్రవేశానికి ఉపయోగపడుతుందనుకున్న ఈ షో, అంబటి వివాదాలను బయటపెట్టింది. మరి టీవీ 9 అంబటికి పాజిటివ్ చేసిందా.. పరువు తీసిందా అని చర్చ కొనసాగుతున్నది. మొత్తానికి టీవీ9 చేసింది మాత్రం నెగిటివ్ అని మాత్రం టాక్ వచ్చింది.






