పవన్ కల్యాణ్ గెటప్ లు అభిమానులకు కనువిందు చేస్తాయి. తమ్ముడు సినిమాలో కూలీ గెటప్ లో అదరగొట్టాడు. బద్రి సినిమాలో మాస్ లుక్ లో అందరిని ఆకర్షించాడు. పవన్ కల్యాణ్ గుడుంబా సినిమాలో ఊర మాస్ తో మెప్పించాడు. ప్యాంట్ మీద ప్యాంట్ వేసి అందరిలో కేక పుట్టించాడు. ఇక గబ్బర్ సింగ్ లో పోలీస్ గెటప్ లో చరిత్ర సృష్టించాడు. ఎర్ర కండువా కట్టుకుని ప్రేక్షకుల్లో జోష్ పెంచాడు.
తమ్ముడు సినిమాలో బాక్సర్ గా కనిపించాడు. వయ్యారి భామ నీ హంస నడక పాట కోసం లుంగీ కట్టి బీడీ తాగుతూ కూలీగా మెప్పించాడు. ఫారిన్ లొకేషన్ లో కూలీగా పవన్ కల్యాణ్ పర్ఫార్మెన్స్ పంట పండించింది. చాలా కాలం తరువాత బ్రో సినిమాలో అలాంటి మాస్ లుక్ ట్రై చేశాడు పవన్. దీంతో మరోమారు కూలీ గెటప్ లో పవన్ ను చూస్తే ఇంకేముంది షాకే.
బ్రో సినిమాలో పవన్, సాయిధరమ్ తేజ్ ఇద్దరు కలిసి నటిస్తుండటం విశేషం. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోమారు సిల్వర్ జూబ్లీ మీద కన్నేశారు. తమ్ముడు సినిమా ఎంతటి రేంజ్ లో అదరగొట్టిందే అలాంటి వండర్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. దీని కోసమే వారిద్దరు మాస్ లుక్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఏదిఏమైనా వీరి కాంబినేషన్ మరింత వండర్ క్రియేట్ చేయడం ఖాయం.
అసలు పవన్ కల్యాణ్ కనిపిస్తేనే అభిమానులు గోల చేయడం సహజమే. అందులో అల్లుడితో కలిసి చేయడం మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. మెగా అభిమానులకు పండగే పండగ. పవన్ కల్యాణ్ ఉంటే చాలు సినిమాను చూడాలనే తపన ఉంటుంది. దానికోసమే వారు ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నారు. ఏక కాలంలో నాలుగు సినిమాలు లైన్లో పెట్టిన పవన్ కల్యాణ్ వరసగా సినిమాలు పూర్తి చేస్తున్నాడు.
ReplyForward
|