
pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ప్రజలకు జరిగే అన్యాయాలను సహించలేకే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నానన్నారు. ప్రజా ధనాన్ని వృధా చేస్తే ఉపేక్షించబోనన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
పవన్ కల్యాణ్ బస్సు యాత్రతో బిజీగా గడుపుతున్నారు. దీంతో నిర్మాతలను కూడా మంగళగిరి చుట్టు పక్కల ప్రాంతాల్లో షూటింగ్ లు పెట్టుకోవాలని చెప్పడంతో వారు కూడా దీనికి సరే అంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో, హరిహర వీరమల్లు, ఓజీ వంటి నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.
దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో తాను ఒకడినని పవన్ వెల్లడించాడు. అనవసరంగా తన వ్యక్తిగత విషయాలు కెలుకుతున్న వారికి తగిన సమాధానం చెబుతానన్నారు. తన పర్సనల్ విషయాలు ప్రస్తావిస్తే వారికి గుణపాఠం చెబుతానని వివరించారు. గతంలో కూడా పలుమార్లు ఇదే విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలో అధికారం చేపట్టాలని తాపత్రయపడుతున్నారు. దీని కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నారు. సినిమాలకు తక్కువ సమయం ఇస్తూ రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నారు. ఇందులో భాగంగా వారాహి వాహనంతో పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని సంకల్పించారు. జగన్ పాలనకు చరమగీతం పాడాలని దృఢంగా నిర్ణయించుకున్నారు.
|
ReplyForward
|






