Varhi Yatraa : జనసేనాని పవన్ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో రెండో రోజుకు చేరింది. మొదటి రోజు అన్నవరం లో పూజల అనంతరం ప్రారంభమైన యాత్ర.. కత్తిపూడి జంక్షన్ లో మొదటి సభతో ఆయన షురూ అయ్యింది. అయితే కత్తిపూడి సభలో ఆయన వైసీపీ, టీడీపీ లపై గట్టిగానే స్పందించారు. ఈసారి తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా ఎవరు ఆపుతారో చూస్తానని గట్టిగానే సవాల్ విసిరారు. దీంతో పాటు సీఎం గా కూడా పదవి ఇస్తే తీసుకుంటానంటూ టీడీపీకి గట్టి షాక్ నే ఇచ్చారు. ఇప్పటివరకు తనకు పదవులు ముఖ్యం కాదంటూ మాట్లాడిన పవన్ ఒక్కసారిగా మాట మార్చారు. తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పటివరకు టీడీపీతో దోస్తీకి సిద్ధమైన పవన్ ఒక్కసారిగా సీఎం సీటుపై కామెంట్ చేయడం ఇప్పుడు కీలకంగా మారింది.
మరోవైపు ఈ సారి ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చబోమని ఆయన పునరుద్ఘాటించారు. వారాహి పై యాత్రకు బయల్దేరిన పవన్ మొదటి రోజే సంచలన వ్యాఖ్యలు చేశారు. కత్తిపూడి జంక్షన్లో అశేషంగా వచ్చిన జనసునామీని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల్లో విడిగా వస్తానో, ఇతరులతో కలిసి వస్తానో అంటూ సస్పెన్స్ లో పెట్టారు. పొత్తులపై ఇంకా చర్చలు మాత్రమే కొనసాగుతాయని చెప్పారు. ఇదే సమయంలో టీడీపీ ని అలెర్ట్ చేసేలా ఆయన కొన్ని స్టేట్ మెంట్లు ఇచ్చారు. సీఎం సీటు ఇస్తే సంతోషంగా తీసుకుంటానన్నారు. పొత్తు ధర్మంలో సీటు అడుగుతున్నారా.. లేదంటే నేరుగా ప్రజలనే తనను సీఎం చేయాలని కోరుతున్నారా అనేది ఆయన చెప్పలేదు. అయితే పవన్ మాత్రం పొత్తులకు చాన్స్ అంటూనే కండిషన్లు అప్లై అంటూ షాక్ ఇచ్చారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కు మంచి సంబంధం ఉంది. ఇప్పటికే పొత్తుల విషయంలో వారిద్దరి మధ్య ఒక క్లారిటీ ఉంది. అయితే తొలిసారిగా పవన్ విడిగా కూడా రావచ్చు అంటూ కొత్త వేడిని తెచ్చే ప్రయత్నం మాత్రం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటూ సాగిన పవన్ స్పీచ్ ఇప్పుడు కొత్త పంథాలోకి మారడం అందరికీ అంతు పట్టడం లేదు.
ఈసారి ఎలాగైనా తన సత్తాచాటాలని పవన్ భావిస్తున్నారు. అందుకే వారాహిపై యాత్రకు బయల్దేరారు. అధికార వైసీపీని గట్టిగా మందలిస్తూనే టీడీపీకి కూడా తన బలమేంటో చూపాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. ఏదేమైనా ఈ సారి జనసేనాని స్పీచ్ లో పూర్తి క్లారిటీ కనిపిస్తోంది. 2024 ఎన్నికల ద్వారా ఏపీ రాజకీయాల్లో తాను కీలకం కావాలన్న తపన ఆయనలో కనిపించింది. అసెంబ్లీలో అడుగు పెడుతా అని గట్టిగా చెప్పడం ద్వారా తన లక్ష్యాన్ని కూడా చెప్పారు జనసేనాని. సీఎం అయినా ఓకే అంటూ జనసైనికుల్లో జోష్ పెంచారు. వారాహి రథంపై పవన్ వస్తుంటే అభిమానగణం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇక మొదటి రోజు పవన్ ప్రసంగం వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. మరి పవన్ కళ్యాణ్ వ్యూహమేంటి.. ఆయన వైసీపీ , టీడీపీలకు ఏం చెప్పదల్చుకున్నారు.. భవిష్యత్ రూట్ మ్యాప్ ఏంటి ఆనేది 24 వరకు సాగనున్న యాత్రలో సభల ద్వారా మరింత క్లారిటీ రానుంది.
|
ReplyForward
|






