తెలుగు సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఒక ప్రభంజనం. ఆయన ట్రెండ్ సృష్టిస్తారు.. యూత్ ఫాలో అవుతుందని గతంలో చూశాం. ఇప్పుడు ఆయన సినిమా రంగంతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలని అనుకుంటున్నారు. మొదటి అడుగులో విఫలమై, ఆయన రెండు చోట్లా ఓడిపోయారు. అయితే ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీతో పొత్తులు ఉంటాయని ఆయన చెబుతున్నారు.
అయితే ఏపీలో వైసీపీ, టీడీపీ బలంగా ఉన్నాయి. ఈ రెండూ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీరికి దీటుగా జనసేన రావాలనుకుంటుంది. అయితే ఓట్లు చీలితే మరోసారి జగన్ అధికారంలోకి రావడం ఖాయం. ఇది గమనించే ఆయన పొత్తుల ప్రతిపాదనలు తెస్తున్నారు. అయితే పవన్ మాత్రం కర్ణాటకలో జేడీఎస్ లాగే తాను కూడా రాష్ర్ట రాజకీయాల్లో కీలకంగా మారాలని చూస్తున్నారు. ఈ దశలోనే మిగతా రెండు పార్టీలకు తన బలం చూపించేందుకు వారాహి యాత్ర మొదలు పెట్టారు.
అయితే పవన్ కు అభిమాన గణం పెద్ద ఎత్తున ఏపీలో ఉంది. అయితే ఇప్పుడు పవన్ తన బలం చూపించాలనుకునేది చంద్రబాబుకు మాత్రమేనని కనిపిస్తున్నది. రథయాత్ర ద్వారా తమ పార్టీకి సీట్ల సంఖ్య పెంచాలని ఆయన ఆల్టిమేటం జారీ చేస్తున్నట్లు కనిపించింది. టీడీపీ తమను తక్కువ అంచనా వేస్తు్న్నదని ఆయన భావిస్తున్నట్లుగా భావిస్తున్నారు. తాను రాష్ర్టంలో క్రియాశీలకంగా మారాలనుకుంటుండగా, టీడీపీ తక్కువ సీట్లు ఆఫర్ చేస్తే ఎలా తిప్పికొట్టాలనే భావనలో ఆయన ఉన్నారు. జన సేన శ్రేణులను కాపాడుకోవడం కూడా ఇప్పుడు పవన్ కు అవసరం. ఈనేపథ్యంలో తన బలం చూపించి 50 సీట్లకు పైగా కోరాలని పవన్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తున్నది.
మరోవైపు గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం పెరుగుతోంది. ఇప్పటికే అనేక సర్వేలు ఈ విషయాన్ని చెప్పాయి. అదే టైంలో టీడీపీ కూడా ఆ జిల్లాల్లో బలంగా ఉంది. ఇప్పుడు తమ బలం చూపిస్తేనే టీడీపీ వింటుందని ఆయన భావిస్తున్నారు. అయితే వారాహి యాత్ర ద్వారా టీడీపీ ఆలోచనలు మారుతాయా.. జనసేనతో సర్దుబాటు జరుగుతుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ఒక వేళ జనాదరణ పెరిగితే పవన్ ఒంటరి పోరు వైపుగా ఆలోచిస్తారా అనేది కూడా తేలనుంది.
|
ReplyForward
|






