
Power Star Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈయన పేరు చెబితే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కు పూనకాలే.. పవర్ స్టార్ క్రేజ్ గురించి అసలు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈయన సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తూనే ఉంటారు.. అంతగా ఫాలోవర్స్ ఈయనకు ఉన్నారు..
ఒకప్పుడు పవర్ స్టార్ సినిమ అంటే యూత్ లో యమక్రేజ్.. గత 20 ఏళ్ల క్రితం పవన్ కు ఉన్న క్రేజ్ అందరి ఊహకు కూడా అందదనే చెప్పాలి.. ఇప్పుడు కూడా ఈయన రాజకీయాలంటూ బిజీ బిజీగా తిరుగుతున్న ఆయన సినిమాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కోకొల్లలు.. మరి అందుకే పవన్ తన నిర్ణయం మార్చుకుని మరీ మళ్ళీ సినిమాల్లోకి ఫ్యాన్స్ కోసం రీ ఎంట్రీ ఇచ్చాడు.
అలాంటి పవన్ కళ్యాణ్ కోసం నిర్మాతలు ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహీ యాత్రలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ యాత్ర కారణంగా సినిమాలకు బ్రేక్ తప్పదు అని అంతా అనుకున్నారు. కానీ పవర్ కోసం ఆయన సినిమా నిర్మాతలు తీసుకున్న నిర్ణయానికి అంతా షాక్ అవుతున్నారు.
ఈయన ప్రస్తుతం మంగళగిరి ప్రాంతాల్లో వారాహి యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవసరమైతే మంగళగిరి లోనే సెట్స్ వేసి అక్కడే షూటింగ్స్ కూడా చేస్తాం అని పవన్ కళ్యాణ్ నిర్మాతలు చెప్పడం ఫ్యాన్స్ లో సంతోషం కలిగిస్తుంది. పవన్ ఎక్కడ ఉంటే అక్కడ షూటింగ్స్ ఎలా చేస్తారో చూడాలి.. పవన్ కోసం నిర్మాతలు అలా ముందుకు రావడమే సంతోషదగిన విషయం..
|
ReplyForward
|






