
Powe Star Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర గురువారం రెండో రోజుకు చేరుకుంది. మొదటి రోజు బుధవారం అన్నవరం లో సత్యదేవుడి పూజల అనంతరం మొదలైన యాత్ర సాయంత్రం కత్తిపూడి జంక్షన్ లో మొదటి సభలో మాట్లాడారు. ఈనెల 24 వరకు పవన్ యాత్ర ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొనసాగనుంది.
అయితే మొదటి రోజు వారాహి యాత్ర సక్సెస్ అయ్యింది. ఈ యాత్ర వెంట జన సునామీ పెద్ద ఎత్తున తరలివచ్చింది. జన సైనికులు, యువత వెంట రాగా పవన్ వారాహి రథంపై ముందుకు సాగారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల్లో ఎండగట్టేందుకు పవన్ ఈ యాత్రను మొదలుపెట్టారు. కాగా గోదావరి జిల్లాలలకు చెందిన జన సైన్యం, స్థానిక ప్రజానీకం పవన్ ను చూసేందుకు బారులు తీరింది. రోడ్లన్నీ కిక్కిరిశాయి. వారిని నియంత్రించడం పోలీస్ సిబ్బందికి కష్టతరమైంది. అయితే యాత్రకు జన సైనికులు రాకుండా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అడ్డుకుంటున్నారని జనసేన శ్రేణులు ఆరోపించాయి. యాత్రను ఎలాగైన ఆపాలని ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. అయినా పెద్ద సంఖ్యలో జనం తరలిరావడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ పై అభిమానాన్ని ఎవరూ ఆపలేరని, ఇక రానున్న ఎన్నికల్లో జనసేన ఇదే ప్రభంజనం సృష్టించబోతున్నదని జన సేన శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
అయితే వారాహి యాత్ర మొదటి రోజు అపశృతి చోటు చేసుకుంది. అశేష జనవాహిని తరలిరాగా, ఒక యువకుడు అత్యుత్సాహంతో ట్రాన్స్ ఫార్మర్ పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ముందు నుంచి యువత కొంత అప్రమత్తంగా ఉండాలని జనసేన కోరుతున్నది. పవన్ ను చూసేందుకు ఎగబడుతుండడంతో, జనసైనికులు అప్రమత్తమయ్యారు. రెండో రోజునుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని జనసేన సిద్ధమైంది.
|
ReplyForward
|






