Sadha Movies : సదా గురించి తెలుగు ప్రేక్షకులకు బాగానే సుపరిచితం.. జయం సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఇక ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే ఈ ముద్దుగుమ్మ బ్లాక్ బస్టర్ అందుకుంది.. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఇక ఈమె టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించి కెరీర్ పరంగా అయితే సక్సెస్ అయ్యింది.
తెలుగు లోనే కాకుండా తమిళలో కూడా హీరోయిన్ గా నటించి కోలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.. అయితే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.. 40 ఏళ్ళు వస్తున్నా కూడా ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా సింగిల్ మిగిలి పోయింది.. అందుకు కారణం ఈమె లవ్ ఫెయిల్యూర్ అని.. గతంలో ఈమె ఒక హీరోను ప్రేమించి మోసపోయినట్టు తెలుస్తుంది.
ఈ విషయం కాస్త పక్కన పెడితే ఈమె హీరోయిన్ గా కెరీర్ ఫామ్ లో లేకపోయిన కూడా బుల్లితెర మీద డాన్స్ షో చేసి మరింత పాపులర్ అయ్యింది. ఢీ షోకు జడ్జ్ గా వ్యవహరించి కొన్నాళ్ల పాటు బాగానే కెరీర్ ను లాక్కొచ్చింది.
ఇక ఈ మధ్య సోషల్ మీడియాపై మరింత కాంట్రన్సేషన్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజెన్స్ కు అందాల విందు ఇస్తుంది.. ఈమె అందాల విందు చూసి నెటిజెన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈమె ఎల్లో చీరలో ముద్దబంతిలా ఉన్న బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసింది.. ఈ పిక్స్ తెగ ఆకట్టు కుంటున్నాయి. ఈ వయసులో కూడా ఈ బ్యూటీ అందానికి అంతా మెస్మరైజ్ అవుతున్నారు.






