స్టార్ హీరోల చిత్రాల్లో నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు కానీ హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా స్టార్ హీరోలను రిజెక్ట్ చేస్తోంది. దాంతో సదరు స్టార్ హీరోలు అలాగే దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే …… స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కెరీర్ లో ఎన్నో సినిమాలు ఉన్నాయి …… సక్సెస్ ల శాతం తక్కువే కానీ ఈ భామకు మాత్రం విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
దాంతో పలువురు దర్శక నిర్మాతలు అలాగే స్టార్ హీరోలు సాయి పల్లవి కోసం ఎదురు చూస్తున్నారు. తమ సినిమాలో సాయి పల్లవిని తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ ఈ భామ మాత్రం మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఆ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా అలాగే తమిళ స్టార్ హీరోలు ఇళయ దళపతి విజయ్ , అజిత్ సినిమాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో చిరు సోదరిగా సాయి పల్లవికి అవకాశం వచ్చింది. నయనతార కంటే ముందుగా సాయి పల్లవినే అనుకున్నారు. అయితే ఆ పాత్ర చేయలేనని చెప్పిందట దాంతో చేసేదిలేక నయనతారను ఎంపిక చేసారు. అలాగే విజయ్ హీరోగా నటించిన వారిసు ( తెలుగులో వారసుడు ) చిత్రంలో మొదట హీరోయిన్ గా సాయి పల్లవినే అనుకున్నారు ……. సంప్రదించారు కూడా. అయితే నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కాబట్టి చేయను అని తెగేసి చెప్పిందట దాంతో రష్మిక మందన్నను తీసుకున్నారు.
అలాగే అజిత్ హీరోగా నటించిన ” వలిమై ” చిత్రంలో మొదట హీరోయిన్ గా సాయి పల్లవినే అనుకున్నారు. కానీ అంతగా ప్రాధాన్యత లేని పాత్రను చేయనని రిజెక్ట్ చేసిందట. ఇలా స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేస్తూ పొగరుగా వ్యవహరిస్తోంది అంటూ సాయి పల్లవి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు. అయితే ఎవరు ఎంతగా విమర్శలు చేస్తున్నా ఈ భామ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు …… ఎందుకంటే ….. సాయి పల్లవి హైబ్రిడ్ పిల్ల కావడమే !.