23.8 C
India
Wednesday, August 12, 2026
More

    Sree Leela : ”గుంటూరు కారం” నుండి శ్రీలీల ఫస్ట్ లుక్ పోస్టర్.. విలేజ్ బ్యూటీగా అదరహో..

    Date:

    Sree Lilla  To days Birthday
    Sree Lilla To days Birthday

    Sree Leela : టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ లకు కూడా అందకుండా దూసుకు వెళ్తున్న బ్యూటీ శ్రీలీల.. ఎంతో మంది ముద్దుగుమ్మలను వెనక్కి నెట్టి మరీ  ఈ భామ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా శ్రీలీల దూసుకు పోతుంది. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇవ్వగా పర్వాలేదు అనేంతగా హిట్ అందుకుంది. కానీ ఈమె టాలెంట్ ను టాలీవుడ్ విడిచి పెట్టలేదు.

    ఈమెకు వరుస అవకాశాలు ఇచ్చి మరీ ఇక్కడే ఉండేలా చేసారు.. ఈమె నటన, అందం ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది.. ఇక ఈ మధ్య వచ్చిన ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మరింత గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ధమాకా లో మాస్ రాజా ఎనర్జీని మించి ఈమె ఆకట్టుకుంది.. ఈ సినిమా హిట్ తర్వాత శ్రీలీల మరిన్ని అవకాశాలు అందుకుంటుంది..

    కుర్ర హీరోల సరసన మాత్రమే కాదు స్టార్ హీరోల సరసన కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతున్న ఈ బ్యూటీ ఈ రోజు బర్త్ డే జరుపు కుంటుంది.. ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న సినిమాల నుండి ఈమెకు బర్త్ డే విషెష్ చెబుతూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాల్లో మహేష్ బాబు గుంటూరు కారం కూడా ఉంది.

    ఈ క్రమంలోనే ఈమె ఫస్ట్ లుక్ ను త్రివిక్రమ్ అండ్ టీమ్ ఈమె బర్త్ డే కానుకగా రిలీజ్ చేసారు. ఈమె లుక్ చూస్తుంటే విలేజ్ బ్యూటీగా ఈ భామ అలరించనుంది అనిపిస్తుంది. లంగా వోణీలో కాలికి నెయిల్ పోలిష్ పెట్టుకుంటూ లుక్ విసిరిన ఈ భామను చూసి కుర్రకారంతా గుండెల మీద చెయ్యేసుకుంటున్నారు.. చూపులతోనే కట్టిపడేస్తూన్నా ఈ ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ఈ భామ ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related