
TDP : ఏపీలో ఎన్నికల సమరానికి టీడీపీ, వైసీపీ, జనసేన సిద్ధమవుతున్నాయి. తమ పక్క వ్యూహాలతో ప్రణాళిక లు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీపై పై చేయి సాధించేందుకు టీడీపీ కొంత ఉత్సాహంతో దూసుకుపోతున్నది. జనసేనతో పొత్తు ఖరారు కావడమే శ్రేణుల ఉత్సాహానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఈ రెండు పార్టీలు ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల పైనే ఆశలు పెట్టుకున్నాయి. ఓట్లు చీలకుండా ఉండేందుకే పొత్తులతో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు పడ్డాయి. టిడిపికి 40 శాతం ఓట్లు పడ్డాయి. ఈసారి ఇలాగే కొనసాగినా ప్రభుత్వ వ్యతిరేకత పది శాతం మించి ఉంటుందా అనేది అనుమానమే. గతంలో టీడీపీపై వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి వైసీపీకి ఓట్లు మళ్లెందుకు అవకాశం దక్కింది.
ముఖ్యంగా 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ఆ పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రుణమాఫీ, ఉద్యోగాలు ఇలాంటి ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చ లేకపోయారు. ఈ సమయంలో ప్రభుత్వం పై వ్యతిరేకంగా వచ్చిన ఓటు అంతా వైసీపీకి పాజిటివ్ గా మారింది. మరి ఈసారి అధికార వైసిపి పార్టీపై అంత వ్యతిరేకత ఉందా అంటే ఆ స్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. ఐదు నుంచి ఆరు శాతం ఓట్లు మళ్లీనా టీడీపీ అధికార పీఠం కైవం చేసుకోవడం కష్టమే. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తన గత ఓటు బ్యాంకును కాపాడుకోవడంతోపాటు జనసేన ఓట్లను కూడా కలుపుకుంటేనే కొంత మెరుగు లెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. మరి ఆ దిశగా టీడీపీ ఎలాంటి లెక్కలతో, ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుందో చూడాలి.






