
TDP VS YSRCP : ఏపీలో రాజకీయ పార్టీలకు ఉత్తరాంధ్ర ఎంతో కీలకం. ఎన్నో సంచలనాలకు ఈ ప్రాంతం వేదిక గా నిలుస్తుంది. అధికార పీఠం ఎక్కాలంటే ఇక్కడే గెలిచే సీట్లపైనే అంతా ఆధారపడి ఉంటుంది. 1983 లో టీడీపీ ఆవిర్భావానికి ముందు ఈ ప్రాంతం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఎన్టీఆర్ ప్రభంజనంలో టీడీపీ కి కంచుకోటగా ఉత్తరాంధ్ర కంచుకోటగా మారింది. కొంతకాలానికి కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్లుగా కనిపించినా, 1994లో మాత్రం టీడీపీ పూర్తిస్థాయిలో ప్రభంజనం సృష్టించింది. గతంలో కింజవరపు ఎర్రన్నాయుడు, ప్రతిభాభారతి, అశోక గజపతిరాజులాంటి ఎందరో కీలక నాయకులు టీడీపీ తరఫున ఉత్తరాంధ్రను ఏలారు. 1995 సంక్షోభంలోను కీలకంగా ఉత్తరాంధ్ర చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించింది.
మళ్లీ టీడీపీనే దిక్కు..
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు ఉత్తరాంధ్ర మొగ్గు చూపింది. ఒక్క చాన్స్ అంటూ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన జగన్ వైపు ప్రజలు మొగ్గారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాలతో ఇంటింటికీ చేరాడు. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి మాత్రం చేసిందేమీ లేదని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కేవలం విశాఖను రాజధానిగా ప్రకటించడం మినహా, ఉత్తరాంధ్రకు జగన్ కొత్తగా చేసిందేమీ లేదనేది టాక్. మరి 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్రలో లెక్కలు, సమీకరణాలు మారుతున్నాయి. మరోసారి అంతా టీడీపీ వైపు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర కు గతంలో ప్రత్యేకంగా టీడీపీ చేసిందేమీ లేకున్నా కొంత వరకు వైసీపీ కంటే బెటర్ అనే అభిప్రాయం చాలా మందిలో ఉండడమమే దీనికి కారణం. ఇప్పుడు కూడా టీడీపీ కి అక్కడ కీలక నేతలు ఉన్నారు. అశోక్ గజపతిరాజు, గంటా శ్రీనివాస్ రావు, అయ్యన్నపాత్రుడు లాంటి కీలక నేతలు వారికి ఉన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలే సాక్ష్యం..
అయితే ఇటీవల ఉత్తరాంధ్ర పట్టభద్రలు వైసీపీని కాదని, టీడీపీ వైపు మొగ్గు చూపారు. విశాఖను రాజధానిగా ప్రకటించినా, అక్కడ టీడీపీ గెలుపును వైసీపీ అగ్రనేతలు ఆపలేకపోయారు. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఉత్తరాంధ్రలో మారుతున్న సమీకరణాలు వైసీపీకి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్ర ఓటర్లను కొంత ప్రభావితం చేయగల పవన్ కళ్యాణ్ కూడా ఈసారి టీడీపీతో కలిసి నడుస్తున్నారు. ఇక టీడీపీ మరింత తిరుగుండదని అంతా భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ పై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకత కూడా తమకు లాభిస్తుందని టీడీపీ శ్రేణులు అంచనా వేసుకుంటున్నాయి. మెజార్టీ అసెంబ్లీ సీట్లపై ఇప్పటికే పట్టు సాధించామని, రానున్న ఎన్నికల్లో గెలిచి తీరుతామని స్పష్టం చేస్తున్నాయి.
|
ReplyForward
|






