KCR is going to shock party Kaushik Reddy!
Telangana KCR : వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ షాక్ ఇయ్యబోతున్నట్లుగా తెలుస్తున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటెలను ఢీకొట్టేందుకు కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది. అయితే ఇటీవల ఈటల రాజేందర్ హత్యకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు బయటికి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కేంద్రం కూడా వెంటనే జోక్యం చేసుకొని ఈటెల కు వై కేటగిరి భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది. దీంతో వెంటKaushik Reddy! నే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం తామే భద్రత కల్పిస్తామంటూ పోలీసులను ఈటెల ఇంటికి పంపించింది.
హుజురాబాద్ నియోజకవర్గం లో కొంతకాలంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సొంత పార్టీలో కూడా ఆయనకు మద్దతు లేకుండా పోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో హుజురాబాద్ లో పరిస్థితి ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ గెలుపు గల్లంతవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈటెల రాజేందర్ పై మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిని బరిలోకి దింపాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనిపై కేసీఆర్ ఇప్పటికే ఆరా తీసినట్లు తెలుస్తున్నది. ఈటల రాజేందర్ ను ఢీ కొట్టాలంటే బలమైన నేత హుజరాబాద్ లో అవసరం ఉంది. అందుకే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్పుగా అవకాశం ఇచ్చినా పలు వివాదాల్లో ఆయన తల దూర్చడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డికి షాకిచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారని సమాచారం. ఇటు డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఈటెల కు రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది.
మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్నది. ఇటీవల ముదిరాజులపై అయన వ్యాఖ్యలు బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులు ఆందోళనకు దిగారు. ఏకంగా అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి చేటు చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. మరోవైపు పార్టీలో కూడా కొందరు పాడి వ్యాఖ్యలను ఖండించారు. దీంతో పాటు గతంలోనూ గవర్నర్ను కూడా కించపరిచేలా మాట్లాడి, చివరకు క్షమాపణ చెప్పారు. ఇదంతా పార్టీకి చేటు చేస్తుందని సీఎం గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి కి షాక్ ఇయ్యబోతున్నట్లుగా సమాచారం.
ReplyForward
|