సినీ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్నప్పుడే ఏదైనా చెయ్యాలి.. లేకపోతే డిమాండ్ మొత్తం అయిపోయాక చేస్తామంటే ఎవ్వరు ఒప్పుకోరు.. అందుకే డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, టెక్నీషయన్స్ అంతా కలిసి నిర్మాతల జేబులకు చిల్లు పెడుతుంటారు. వారికీ డిమాండ్ ఉన్నప్పుడే అన్ని ఖర్చు పెట్టిస్తూ రాయల్ లైఫ్ అనుభవిస్తారు.
మరి తాజాగా మన టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరైన థమన్ కూడా ఒక నిర్మాతకు భారీ షాక్ ఇచ్చాడట. కేవలం హోటల్ కే 40 లక్షల రూపాయల బిల్ కట్టించి పెద్ద బొక్క పెట్టారట. మరి ఇప్పుడు టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ రాయల్ ట్రీట్ అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇతడు చేసే సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో నిర్మాతలు కేసుల ఆయన అడిగింది చేస్తున్నారు. ఈయన నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడని టాక్.. ఎప్పుడు చెన్నైలో ఉండే థమన్ వర్క్ కోసమే హైదరాబాద్ కు వస్తారట.. మరి ఈయన హైదరాబాద్ వస్తే కేవలం పార్క్ హయత్ హోటల్ లోనే స్టే చేస్తారని అందుకోసం ఈయనకు అక్కడ ఎప్పుడు రూమ్స్ బుక్ చేసి ఉంచుతారని తెలుస్తుంది.
ఈ రూమ్ లలోనే ఈయన వర్క్ చేసుకుంటాడు అని ఒక సూట్ రూమ్ సహా కొన్ని రూమ్ థమన్ పేరు మీద బుక్ చేసి ఉంచుతారని తాజాగా ఒక సినిమా కోసం అలానే హోటల్ లో స్టే చేయగా ఈయన ఏకంగా నిర్మాతకు 40 లక్షల బిల్ పంపారట.
ఈ బిల్ చూసి ఆయన షాక్ అయ్యాడని న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. అయితే ఈయన కోసం అంత భరించిన కూడా ఈ మధ్య బిజీగా ఉండి సమయానికి మ్యూజిక్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా ప్రెజెంట్ ఈయన ట్రెండ్ నడుస్తుండడంతో కామ్ గా భరించాల్సి వస్తుంది..
|
ReplyForward
|






