
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. లేదంటే జబ్బుల బారిన పడతాం. దీంతో వాటి నుంచి రక్షించుకోవాలంటే మన ఆహార శైలి మార్చుకోవాలి. రోగాలు లేకుండా శరీరాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు మన ఆహారంలో మార్పులు చేసుకోవడం అనివార్యం. ఈ నేపథ్యంలో విటమిన్ డి లోపం తలెత్తితే అనారోగ్యాల పాలవుతాం. దీంతో విటమిన్ డి లోపం లేకుండా చూసేందుకు కొన్ని ఆహారాలు తీసుకోవాలి.
ఆవుపాలు
విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉండాలంటే ఆవుపాలు తాగడం అవసరం. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలంగా ఉండటానికి సాయపడతాయి. చర్మం మెరిసేందుకు దోహదపడతాయి. ఆవుపాలు పచ్చిగా తాగితే మంచిది. ఒకవేళ తాగలేకపోతే స్మూతీగా తీసుకోవడం ఉత్తమం. వీటిని తాగేముందు అందులో చాక్లెట్ సిరప్ కలుపుకోవడం మంచిది.
సోయా
సోయా పాలల్లో విటమిన్ డి లోపం నివారించే గుణం ఉంటుంది. ఇందులో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. సోయా బీన్స్ నుంచి తయారు చేసిన పాలలో మంచి ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ పాలల్లో ఇనుము, పాస్పరస్, నియాసిన్, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటుంది. తక్కువ శాతంలో కొవ్వు ఉంటుంది.
సిట్రస్ జ్యూస్
పులుపుగా ఉండే పండ్లు సిట్రస్ పండ్లు. ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి చర్మ సంరక్షణలో ఎంతగానే ఉపయోగపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఈ నేపథ్యంలో ఆరెంజ్ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల విటమిన్ డి దొరుకుతుంది.
సోయా
సోయా వల్ల కూడా మనకు విటమిన్ లోపం లేకుండా పోతోంది. ఇవి ఎముకలు బలంగా తయారవడానికి తోడ్పడుతుంది. సోయా పాలతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పాలలో ఇనుము ఫాస్పరస్, నియాసిన్, విటమిన్ సి అధికంగా ఉండటంతో రక్తప్రసరణ వ్యవస్థకు హాని కలిగించే కొవ్వు తక్కువగా ఉంటుంది.






