దక్షిణ కొరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజధాని సియోల్ లో జరిగిన హాలోవీన్ వేడుకల్లో తీవ్ర తొక్కిసలాట జరగడంతో ఊపిరాడక , అలాగే గుండెపోటుతో 149 మంది మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణం జరగడానికి కారణం ఇరుకైన రోడ్ల పైకి దాదాపు లక్ష మంది ఒకేసారి రావడమే.
ప్రతీ ఏటా తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం హాలోవీన్ వేడుకలు నిర్వహిస్తుంటారు దక్షిణ కొరియా వాసులు. ఆ కార్యక్రమంలో భాగంగానే దాదాపు లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇరుకైన రోడ్ల లోకి ఈ జనాలు చేరుకోవడంతో ఊపిరి ఆడలేదు. దాంతో బయటకు వెళ్లాలని, ముందుకు వెళ్లాలని కొందరు చేసిన ప్రయత్నం లో భాగంగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో మృత్యువాత పడ్డారు. దాంతో దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం నెలకొంది.