హైదరాబాద్ లోని బేగంపేటలోగల పైగా ప్యాలెస్ లో 2002 నుండి సేవలు అందిస్తోంది యూఎస్ కాన్సులేట్. అమెరికా – భారత్ మధ్య దౌత్య పరంగా విశిష్ట సేవలు అందిస్తోంది. గత 20 ఏళ్లుగా బేగంపేట లోని పైగా ప్యాలెస్ సేవలు అందిస్తోంది ….. అయితే బేగంపేటలో రద్దీ పెరగడం , అంతేకాకుండా సేవలను మరింత సరళతరం చేయాలనే ఉద్దేశ్యం తో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అధునాతనమైన భవంతిని నిర్మించారు.
ఆ నిర్మాణం పూర్తి కావడంతో త్వరలోనే యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని బేగంపేట నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు మార్చనున్నారు. ఈ కార్యాలయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ప్రజలకు సేవలు అందించనుంది.