29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Vijay Sai Reddy : రిలాక్స్ వద్దు.. గెట్ రెడీ అంటున్న విజయసాయి..!

    Date:

    Vijay Sai Reddy
    Vijay Sai Reddy
    Vijay Sai Reddy : వైసీపీలో నెంబర్ 2 గా పేరున్న విజయసాయిరెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. అయితే వారం రోజులుగా అయన మళ్లీ తెరపైకి వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. తాజాగా అమరావతిలో వైసీపీ అనుబంధ సంఘాల మీటింగ్ పెట్టారు. రిలాక్స్ గా ఉండవద్దని ఇక 24 గంటలు పార్టీ కోసం పని చేయాలని సూచించారు. యువత, మహిళా, సంఘాలతో ఆయన భేటీ అయ్యారు. అయితే విజయ సాయి రెడ్డికి కొన్ని రోజులుగా పదవులు అన్నీ తీసేసి అనుబంధ సంఘాల బాధ్యతలను అప్పగించారు.  అయితే ఈ అనుబంధ సంఘాల అధ్యక్షులను సజ్జల రామకృష్ణారెడ్డి కమాండ్ చేస్తుంటారు. దీంతో విజయసాయి రెడ్డి కొంత సైలెంట్ అయ్యారని టాక్ వినిపించింది. ఉత్తరాంధ్రలో వైవీ సుబ్బారెడ్డి తో విజయసాయిరెడ్డికి పొసగడం లేదు అందుకే కొంతకాలంగా విజయసాయిరెడ్డి సైలెంట్ అయ్యారని తెలుస్తుంది. టీడీపీ పై ట్వీట్ పెట్టడం కూడా మానేశారు. ఇప్పుడు తన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్ గా మారాక విజయసాయిరెడ్డి బయటకు వచ్చారు. వరుసగా టీడీపీ పై ట్వీట్లు కూడా పెడుతున్నారు. తాజాగా పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశమై రానున్న ఎన్నికల నేపథ్యంలో దిశా నిర్దేశం చేశారు.
    అయితే ఇక విజయసాయి రెడ్డి యాక్టివ్ అయ్యారని ఇక పార్టీకి తిరుగుండదని శ్రేణులు భావిస్తున్నాయి. అయితే బాలినేని వదిలేసిన మూడు జిల్లాల ఇన్చార్జి పదవి విజయసాయికి ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ పదవిని తీసుకున్నాను.. అని కానీ పని చేస్తానని విజయసాయిరెడ్డి ఎక్కడా చెప్పడం లేదు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి పరిస్థితి ఇలా ఎందుకు తయారైందో బయటకు తెలియడం లేదు. కొంతకాలంగా జగన్ తో దూరంగా ఉంటున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి. తారకరత్న చనిపోయిన సమయంలో విజయసాయి చంద్రబాబుతో సఖ్యతతో ఉండడమే జగన్ కోపానికి కారణంగా తెలుస్తున్నది. అయితే దీనిపై అటు పార్టీ శ్రేణులు కానీ ఇటు విజయసాయి రెడ్డి గాని ఎక్కడ స్పందించలేదు. కొంతకాలంగా అసలు పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో కూడా విజయసాయిరెడ్డి కనిపించడం లేదు మళ్లీ ఒక్కసారిగా ఆయనే అనుబంధ సంఘాల ఇన్చార్జిలతో సమావేశం పెట్టడం ఇప్పుడు చర్చ నీయాంశమైంది. అయితే పార్టీ బలోపేతం కోసం ఎంతో చేసిన విజయసారెడ్డి మళ్లీ ప్రాధాన్య స్థితిలోకి రావడం శ్రేణులను ఉత్సాహపరుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijay Sai Reddy : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను : విజయ్ సాయి రెడ్డి

    Vijay Sai Reddy : రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా...

    Vijay Sai Reddy : ఎన్నికల వేళ.. మోదీకి సాయిరెడ్డి కీలక ప్రతిపాదన

    MP Vijay Sai Reddy : దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం క్రమంగా...

    Vijay Sai Reddy YSRCP PArty : మళ్లీ కీలకంగా విజయసాయి.. వైసీపీలో పలు మార్పులు

    Vijay Sai Reddy YSRCP PArty : వైసీపీలో నంబర్ 2...