- కాంగ్రెస్ శ్రేణుల మనోగతం
winning in Karnataka, Karnataka results
winning in Karnataka ఫ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఢిల్లీ నుంచి మొదలుకొని గల్లి దాకా పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని సంబురపడ్డారు. కానీ కథ అక్కడే అడ్డం తిరిగింది. తమ ఆనందం ఇంతలోనే ఆవిరయ్యిందని కన్నడ కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. ఇంతకీ వారి నిరాశకు కారణం ఏంటంటే..
గెలిచినా ఒడ్వని లొల్లి..
కర్ణాటకలో ఘన విజయం సాధించి, ఐదు రోజులు దాటిని ప్రభుత్వం ఏర్పాటు అంశం కొలిక్కి రాలేదు. నేడు, రేపు సీఎం అభ్యర్థి ప్రకటన అంటూ అధిష్ఠానం లీక్ లు ఇస్తున్నది. ఇప్పటికే సిద్ధరామయ్య పేరు ఖరారైందని ఒకసారి, డీకే నే ఫైనల్ అంటూ మరోసారి ఢిల్లీ కేంద్రం వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అధిష్ఠానం, ఏఐసీసీ చీఫ్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గురువారమే ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావించారు. కానీ బుధవారం అర్ధరాత్రి వరకు కూడా కాంగ్రెస్ హై కమాండ్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు కన్నడ ప్రజలు తమ సీఎం ఎవరనే విషయమై ఎదురు చూస్తున్నారు.
పంచాయతీ తేలట్లేదా..
సిద్ధరామయ్య, డీకే ఇద్దరూ సీఎం సీటు కోసం పట్టుబడుతుండడంతో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నది. ఇద్దరినీ బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. రాహుల్, సోనియా, మల్లికార్జున ఖార్గే విడుతల వారీగా ఇద్దరితో మాట్లాడారు. మధ్యవర్తంగా చెరి రెండున్నరేండ్లు సీఎం గా ఉండే అంశం కూడా తెరపైకి తెచ్చారు. అయితే డీకే దీనికి ఒప్పుకోవడం లేదని సమాచారం. ఏదేమైనా ఢిల్లీ కేంద్ర ఈ పంచాయతీ తీరెదెన్నడో అని అంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి ఊహాగానాలు నమ్మవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నది. ఒకటిరెండ్రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని చెబుతున్నది. ఏదేమైనా డీకే కొంత అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అయితే సీఎం అభ్యర్థి తేలితే ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి.